Flipkart Window AC Deals 2026: వేసవిలో చాలామంది ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేరు. ముఖ్యంగా మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్‌కు వేలల్లో డబ్బులు పెట్టి ఏసీలు కొనడం ఆర్థిక భారమే. అయితే ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 40 శాతం తగ్గింపుతో బ్రాండెల్ ఏసీలను ఇచ్చేస్తోంది. అది కూడా క్యారియర్, వోల్టాస్, గోద్రెజ్ వంటి టాప్ బ్రాండ్లనుట తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడీ డిస్కౌంట్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..
ఏసీల విషయంలో క్యారియర్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటి కూలింగ్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ విండో ఇన్వర్టర్ ఏసీపై కళ్లు చెదిరే ఆఫర్ నడుస్తోంది. దీని అసలు ధర దాదాపు రూ.58,000 వరకు ఉంటే, ఇప్పుడు ఆఫర్‌లో జస్ట్ రూ.33,000 లోపే దొరుకుతోంది. దాదాపు 40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చన్నమాట. ఇది ఇన్వర్టర్ మోడల్ కాబట్టి.. కరెంటు బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. దీంతో మీకు రెండు రకాలుగా లాభం ఉంటుంది.
Also Read: మరో సెన్సేషన్‌కు రియల్‌మీ ప్లాన్.. తక్కువ ధరలో 7000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
మనోళ్లు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ వోల్టాస్. మన ఊళ్లలో ఉండే వేడికి వోల్టాస్ ఏసీలు భలే సెట్ అవుతాయి. అందుకే ఫ్లిప్‌కార్ట్ ఈసారి వోల్టాస్ విండో ఏసీలపై 18 నుంచి 25 శాతం వరకు రాయితీ ఇస్తోంది. దీనిలో 1 టన్ లేదా 1.5 టన్ మోడల్స్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి, ధర కూడా తక్కువగా ఉండాలి అనుకునే వాళ్లకు వోల్టాస్ విండో ఏసీలు బెస్ట్ ఛాయిస్.
తక్కువ ధరలో నాణ్యమైన ఏసీ కావాలంటే చాలామంది గోద్రెజ్ వైపు మొగ్గు చూపుతారు. ఈ బ్రాండ్ విండో ఏసీలు ఇప్పుడు 25 శాతం వరకు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ముఖ్యంగా 1.5 టన్ ఏసీలు సుమారు 26 వేల రూపాయల నుంచే అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఉండే కాపర్ కండెన్సర్ వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువే. ఈ ఏసీలను ఇంటికి తెచ్చుకుంటే గది చల్లబడటమే కాదు.. కరెంటు బిల్లు విషయంలో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
నేరుగా ఇచ్చే డిస్కౌంట్లు కాకుండా.. బ్యాంక్ కార్డులపై కూడా ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్లు ఇస్తోంది. ఒకవేళ SBI లేదా HDFC బ్యాంక్ కార్డులు ద్వారా కొనుగోలు చేస్తే.. ఇన్స్టంట్‌గా మరో రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే మీ వద్ద పాత ఏసీ ఉంటే.. దానిని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరో రూ.4,000 వరకు అదనపు బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే చాలా తక్కువ ధరకే కొత్త ఏసీని సొంతం చేసుకోవచ్చు.
Also Read: ఏమిటీ.. YouTube Ask YouTube ఫీచర్? గూగుల్ తెస్తున్న ఈ కొత్త అప్డేట్ ఎలా పనిచేస్తుంది?
ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.