E-Paper
Advertisement

ఏమిటీ.. YouTube Ask YouTube ఫీచర్? గూగుల్ తెస్తున్న ఈ కొత్త అప్డేట్ ఎలా పనిచేస్తుంది?

ఏమిటీ.. YouTube Ask YouTube ఫీచర్? గూగుల్ తెస్తున్న ఈ కొత్త అప్డేట్ ఎలా పనిచేస్తుంది?
Advertisement

YouTube AI Chatbot: యూట్యూబ్‌లో ఏదైనా వీడియో కావాలంటే ఇప్పటివరకు మనం ఏం చేసేవాళ్లం? సెర్చ్ బార్‌లో కేవలం ఒకటి రెండు పదాలు టైప్ చేసి వదిలేసేవాళ్లం. కానీ ఇప్పుడు యూట్యూబ్ తన పద్ధతిని పూర్తిగా మార్చేస్తోంది. మీతో ముచ్చట్లు పెడుతూ మీకు కావాల్సిన దాన్ని వెతికి పెట్టేందుకు Ask YouTube అనే సరికొత్త ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే యూట్యూబ్ వాడకం మరింత సులభం కానుంది.

అసలు ఏంటీ ఈ కొత్త ఫీచర్?

మనం వాట్సప్‌లో మెసేజ్ పంపినట్టే.. ఇప్పుడు యూట్యూబ్‌తో కూడా నేరుగా మాట్లాడొచ్చు. సెర్చ్ బార్ పక్కనే ఉండే Ask YouTube బటన్‌ నొక్కగానే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ప్రశ్నలను అరటిపండు వలిచి చెప్పినట్టుగా క్లియర్‌గా అడగవచ్చు. ఉదాహరణకు: నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను.. మూడు రోజులకు ఒక మంచి ట్రిప్ ప్లాన్ చెప్పవా? అని అడిగితే చాలు, అది వెంటనే స్పందిస్తుంది.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఫోన్ల‌లో ఇక వాట్సప్ పనిచేయదు, డేటాను ఇలా సేవ్ చేసుకోండి!

వీడియోలే కాదు.. మేటర్ కూడా:

మామూలుగా అయితే మనకు వీడియోల లిస్టు కనిపిస్తుంది. కానీ ఈ ఏఐ ఫీచర్ స్పెషాలిటీ ఏంటంటే.. వీడియోలతో పాటు పూర్తి సమాచారాన్ని టెక్ట్స్ రూపంలో ఇస్తుంది. అంటే ఎక్కడ ఆగాలి, ఏమేం చూడాలి, అక్కడ స్పెషల్ ఏంటి అనే విషయాలను ఒక గైడ్‌లా రాసి చూపిస్తుంది. ఇందులో మనకు పనికొచ్చే పెద్ద వీడియోలు, షార్ట్స్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఇది చూస్తుంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది.

డౌట్లు అడగటం ఇంకా ఈజీ:

Advertisement

ఈ చాట్‌బాట్‌తో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. మీరు అడిగిన ప్లాన్‌లో మీకు ఏదైనా నచ్చకపోయినా లేదంటే ఇంకేదైనా అదనంగా కావాలన్నా వెంటనే అడగొచ్చు. మరి దారిలో మంచి టిఫిన్ హోటల్స్ ఎక్కడున్నాయి? అని అడిగితే చకచకా వెతికి పెట్టేస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ మనకు కావాల్సిన పూర్తి క్లారిటీ తెచ్చుకోవచ్చు. దీనివల్ల టైమ్ సేవ్ అవ్వడమే కాదు.. వెతుక్కునే శ్రమ కూడా తప్పుతుంది.

అందుబాటులోకి వచ్చిందా?

ప్రస్తుతానికి ఈ అత్యాధునిక ఫీచర్‌ను యూట్యూబ్ అమెరికాలో టెస్ట్ చేస్తోంది. అక్కడ 18 ఏళ్లు నిండిన యూట్యూబ్ ప్రీమియం మెంబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. గూగుల్ దీనికి సంబంధించిన ఒక డెమో వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే మనలాంటి సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే యూట్యూబ్‌లో వీడియోలు వెతకడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

Also Read: రూటర్ మీద కాయిన్ పెడితే Wi-Fi స్పీడ్ పెరుగుతుందా? పొరపాటున కూడా ఆ పని చేయొద్దు, ఎందుకంటే?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×