E-Paper
Advertisement

మరో సెన్సేషన్‌కు రియల్‌మీ ప్లాన్.. తక్కువ ధరలో ఏకంగా 7000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!

మరో సెన్సేషన్‌కు రియల్‌మీ ప్లాన్.. తక్కువ ధరలో ఏకంగా 7000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
Advertisement

Realme 16x 5G: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే Realme 16 సిరీస్‌లో కొన్ని మోడల్స్ విడుదలై మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఇప్పుడు ఆ సిరీస్‌కే ఫినిషింగ్ టచ్ ఇస్తూ Realme 16x 5Gని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటంటే..

మరో బడ్జెట్ ఫోన్‌..

ప్రముఖ టెక్ నిపుణుల సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ మోడల్ నెంబర్ RMX5270తో రానుంది. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఏమీ చెప్పకపోయినా.. తాజాగా లీకైన వివరాలు చూస్తుంటే లాంచ్ డేట్ ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన Realme 15xకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రాబోతోంది.

Advertisement

Also Read: ఏమిటీ.. YouTube Ask YouTube ఫీచర్? గూగుల్ తెస్తున్న ఈ కొత్త అప్డేట్ ఎలా పనిచేస్తుంది?

స్టోరేజ్ వేరియంట్స్ ఇలా..

ఈ కొత్త ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండేలా ఉంది. ఇది ఎండ్యూరెన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్ అనే రెండు సూపర్ కలర్స్‌లో దొరకనుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. మన అవసరాలకు తగ్గట్టుగా 4GB+128GB, 6GB+128GB, 6GB+256GB అనే మూడు ఆప్షన్లలో రాబోతోంది.

రెండ్రోజుల బ్యాటరీ బ్యాకప్..

Advertisement

పాత మోడల్ Realme 15xలో ఏకంగా 7,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఇప్పుడు రాబోయే 16xలో కూడా అదే రేంజ్ బ్యాటరీ ఉంటుందని అంచనా. దీంతో రోజులో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెడితే రెండు రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు ఫోన్ వాడే వారికి, ప్రయాణాలు చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

ధర ఎంతో తెలుసా?

ఈ ఫోన్ ధర సుమారు రూ.15,000 నుంచి రూ.18,000 మధ్యలో ఉండవచ్చని టాక్. ఈ బడ్జెట్‌లో ప్రస్తుతం ఐకూ Z11x, పోకో M8 వంటి ఫోన్లు ఉన్నాయి. వాటన్నింటికీ రియల్‌మీ 16x గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మంచి డిస్‌ప్లే, స్మూత్ పర్ఫార్మెన్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్లాన్‌లో ఉంది రియల్‌మీ.

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఫోన్ల‌లో ఇక వాట్సప్ పనిచేయదు, డేటాను ఇలా సేవ్ చేసుకోండి!

Related News

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Big Stories

Advertisement
×