E-Paper
Advertisement

Flipkart Year End Sale 2025: ఇప్పుడే కొనాలనిపించే డీల్ మావా.. Galaxy A55 5Gపై ఏకంగా రూ.16,900 తగ్గింపు!

Flipkart Year End Sale 2025: ఇప్పుడే కొనాలనిపించే డీల్ మావా.. Galaxy A55 5Gపై ఏకంగా రూ.16,900 తగ్గింపు!

Flipkart Year End Sale 2025: శాంసంగ్ నుంచి వచ్చే మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో Galaxy A సిరీస్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సిరీస్‌లో తాజాగా విడుదలైన Galaxy A55 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా లాభదాయకమైన డీల్‌గా చెప్పుకోవచ్చు.

ఎంత తగ్గిందంటే?

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Galaxy A55 5G ధర రూ.24,269 మాత్రమే. లాంచ్ టైమ్‌లో ఉన్న రూ.39,999 ధరతో పోలిస్తే.. మీరు దాదాపు రూ.15,700కి పైగా ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,200 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

డిస్‌ప్లే, పనితీరు:

ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. 1000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండటంతో బయట సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

Also Read: భారత్‌లో రియల్‌మీ 16 ప్రో విడుదలకు సిద్ధం.. 200 మెగాపిక్సెల్ కెమెరాతో దుమ్మురేపే స్మార్ట్‌ఫోన్!

స్క్రోలింగ్‌కు బెస్ట్ ఆప్షన్:

ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో Exynos 1480 ప్రాసెసర్ అందించారు. దీంతో రోజువారీ వాడకం నుంచి మల్టీటాస్కింగ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ ఉండటం వల్ల ఫ్యూచర్ యూజ్‌కీ ఇది సేఫ్ ఆప్షన్.

బ్యాటరీ లైఫ్:

ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5Gలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా నడిచేలా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అలాగే 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఛార్జింగ్ టైమ్ కూడా ఎక్కువ తీసుకోదు.

కెమెరా ప్రేమికులకు ప్లస్ పాయింట్:

ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్. వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 5MP మాక్రో లెన్స్ ఇలా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంతో డే లైట్ ఫొటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. ఇక ముందు భాగంలో ఉన్న 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగా ఉపయోగపడుతుంది.

పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్స్:

ఈ ధరకు ఇన్ని ఫీచర్లు కలిగిన శాంసంగ్ ఫోన్ దొరకడం అరుదనే చెప్పాలి. పెద్ద డిస్కౌంట్‌, నమ్మకమైన బ్రాండ్‌, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్స్.. ఈ మూడు ఒకేసారి కావాలంటే Galaxy A55 5G ప్రస్తుతం మంచి డీల్‌గా నిలుస్తోంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే.. ఈ ఆఫర్‌‌ను వదులుకోకండి.

Also Read: ఎంట్రీ లెవల్ 5Gలో గేమ్ ఛేంజర్.. 6,000mAh బ్యాటరీతో Galaxy A07 5G విడుదల ఎప్పుడంటే?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×