E-Paper
Advertisement

ఫ్రిజ్‌కి గోడకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ? 99% మంది చేసే పెద్ద తప్పు ఇదే!

ఫ్రిజ్‌కి గోడకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ? 99% మంది చేసే పెద్ద తప్పు ఇదే!
Advertisement

Fridge Ventilation Gap: ఇంట్లో ఫ్రిజ్ పెట్టేసాం అంటే పని అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. కానీ ఫ్రిజ్‌ని గోడకు అతుక్కుపోయేలా పెట్టడం ఒక పెద్ద మిస్టేక్. దీని వల్ల కరెంట్ బిల్ పెరగడం, కూలింగ్ సరిగ్గా రాకపోవడం, ఫ్రిజ్ త్వరగా పాడవడం లాంటి సమస్యలు వస్తాయి. చిన్నగా కనిపించే ఈ పొరపాటు మీ జేబుకు పెద్ద నష్టం చేస్తుంది. ఫ్రిజ్‌కు ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఈ విషయాన్ని సింపుల్‌గా, క్లియర్‌గా ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్ & గోడ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?

ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా దగ్గరగా పెట్టడం అసలు మంచిది కాదు. సాధారణంగా ఎక్స్‌పర్ట్స్ చెప్పే గైడ్‌లైన్ ఇలా ఉంటుంది.

Advertisement

1. ఫ్రిజ్ వెనుక భాగంలో 5–10 సెం.మీ (2–4 ఇంచులు) దూరం ఉండాలి.
2. పక్కన 2–5 సెం.మీ దూరం ఉండేలా చూసుకోండి.
3. పైభాగంలో.. కనీసం 5 సెం.మీ ఉండటం మంచిది.

ఈ గ్యాప్ వల్ల ఫ్రిజ్‌లో ఉత్పత్తి అయ్యే వేడి సులభంగా బయటకు వెళ్తుంది. ఇదే ఫ్రిజ్ పని తీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఈ చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

ఎందుకు ఈ గ్యాప్ చాలా ఇంపార్టెంట్?
1. కరెంట్ బిల్ తగ్గుతుంది: ఫ్రిజ్ వెనక గాలి సరిగా తిరగకపోతే మోటార్ ఎక్కువగా పని చేస్తుంది. దాంతో పవర్ ఎక్కువ ఖర్చవుతుంది.
2. కూలింగ్ ఫాస్ట్ & బెస్ట్‌గా ఉంటుంది: గ్యాప్ లేకపోతే లోపలి కూలింగ్ సరిగా ఉండదు. సరైన స్పేస్ ఉంటే ఫుడ్ ఫ్రెష్‌గా ఉంటుంది.
3. ఓవర్‌హీటింగ్ సమస్య ఉండదు: ఫ్రిజ్ వెనుక హీట్ బయటకు వెళ్లకపోతే అది వేడెక్కి డ్యామేజ్ అవుతుంది. గ్యాప్ ఉంటే ఈ సమస్య తగ్గుతుంది.
4. ఫ్రిజ్ లైఫ్ పెరుగుతుంది: సరైన వెంటిలేషన్ వల్ల ఫ్రిజ్ ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది.

చాలామంది చేసే కామన్ మిస్టేక్స్:
1. ఫ్రిజ్‌ని గోడకు పూర్తిగా అట్టిపెట్టడం
2. చిన్న కిచెన్‌లో స్పేస్ సేవ్ చేయాలనుకుని దగ్గరగా పెట్టడం
3 ఫ్రిజ్ వెనుక దుమ్ము క్లీనింగ్ చేయకపోవడం
4. మాన్యువల్‌లో ఇచ్చిన గైడ్‌లైన్ ఫాలో కాకపోవడం

ఇవి చిన్న విషయాల్లా అనిపించినా.. ఫ్యూచర్‌లో పెద్ద ఖర్చులు తెస్తాయి.

Also Read: యాపిల్ ఎయిర్‌పాడ్స్‌‌పై భారీ డిస్కౌంట్.. జస్ట్ రూ.9,999 కే అదిరిపోయే ఫీచర్లు మీ సొంతం!

పాటించాల్సిన చిట్కాలు:
🔹 ఫ్రిజ్ పెట్టే ముందు టేప్‌తో గ్యాప్ కొలవండి.
🔹 నెలలో ఒకసారి ఫ్రిజ్ వెనక భాగం క్లీనింగ్ చేయండి.
🔹 కిచెన్‌లో ఎయిర్ ఫ్లో ఉండేలా చూసుకోండి.
🔹 కొత్త ఫ్రిజ్ కొంటే మాన్యువల్ తప్పకుండా చదవండి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×