E-Paper
Advertisement

జానర్ మార్చడం కాదు కంటెంట్ లో పస ఉండాలి.. నరేష్ కొత్త మూవీపై నెటిజన్స్ ట్రోల్స్!

జానర్ మార్చడం కాదు కంటెంట్ లో పస ఉండాలి.. నరేష్ కొత్త మూవీపై నెటిజన్స్ ట్రోల్స్!
Advertisement

Allari Naresh:ప్రముఖ దిగ్గజ దర్శకులు.. ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నరేష్. ‘అల్లరి’ సినిమాతో హీరోగా అవతరించి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకొని.. అల్లరి నరేష్ గా అవతరించిన ఈయన ఎక్కువగా కామెడీ ప్రధాన చిత్రాలు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా కామెడీ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి సీరియస్ కథలనే ఎంచుకుంటున్నారు. కామెడీ హీరో అనే పేరును మార్చుకొని ‘నాంది’ అనే సినిమాతో సీరియస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మళ్లీ రూట్ మార్చిన అల్లరి నరేష్..

ఆ తర్వాత ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, బచ్చలమిల్లి వంటి చిత్రాలు చేశారు. అయితే ఏవీ కూడా అనుకున్నంత స్థాయిలో నరేష్ కి గుర్తింపును అందివ్వలేదు..ఒకప్పుడు కామెడీ పాత్రలతో అలరించి ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఇప్పుడు సీరియస్ లుక్ లో కనిపించేసరికి అభిమానులు స్వీకరించలేకపోయారు. ఇక దీంతో చేసేదేమీ లేక జానర్ మార్చేశారు నరేష్.. అలా ఇప్పుడు భక్తి నేపథ్యంలో సాగే కథపై దృష్టి పెట్టారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వస్తున్న ‘కనకదుర్గ’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల ముఖ్యఅతిథిగా హాజరై ఈ సినిమాను ప్రారంభించారు.

కనకదుర్గ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..

Advertisement

ఇకపోతే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కంటెంట్ స్టూడియోగా మంచి పేరు సొంతం చేసుకున్న అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కనకదుర్గ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. అటు టెంపుల్ టౌన్ పిక్చర్స్ తో కలిసి రూపొందుతున్న ఈ సినిమాలో భక్తి, యాక్షన్, సంగీతం, భావోద్వేగాలు వంటి అన్ని అంశాల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.ఇకపోతే ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కథను బీవిఎస్ రవి అందించారు. దీపక్ సెహగల్, సమీర్ నాయర్, బీవిఎస్ రవి, అజిత్ ఠాకూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ALSO READ:పెద్ది విడుదలపై డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన.. సందిగ్ధంలో నిర్మాతలు!

హెచ్చరిస్తున్న సినీ ప్రేమికులు..

Advertisement

ఇకపోతే ఈ సినిమాతో ఇప్పుడు అల్లరి నరేష్ తన జానర్ ను మార్చేయడంతో సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా కథలో కంటెంట్ ఉంటే ఎలాంటి చిత్రమైనా సరే మంచి విజయం అందుకుంటుంది. కేవలం జానర్ మార్చినంత మాత్రాన సక్సెస్ కొడతామన్న గ్యారెంటీ లేదు. కాబట్టి జానర్ మార్చడం కాదు కథలో కంటెంట్ ఉందో లేదో చూసుకో అంటూ హెచ్చరిస్తున్నారు. మరి సీరియస్ నెస్ వర్కౌట్ కాకపోవడంతో భక్తి జానర్ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్ కి ఈ సినిమా నైనా మునుపటి వైభవాన్ని అందిస్తుందేమో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×