E-Paper
Advertisement

పైసా ఖర్చు లేని సూపర్ ట్రిక్.. కేవలం 2 నిమిషాల్లో.. ఫ్రిడ్జ్ కూలింగ్ సమస్యకు పరిష్కారం!

పైసా ఖర్చు లేని సూపర్ ట్రిక్.. కేవలం 2 నిమిషాల్లో.. ఫ్రిడ్జ్ కూలింగ్ సమస్యకు పరిష్కారం!
Advertisement

Fridge Cooling Issue: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఒక ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. పచ్చి కూరగాయలు, పాలు, పెరుగు, మిగిలిన ఆహారపదార్థాలు తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్ తప్పనిసరి. అయితే ఈ విషయంలో ఒక్కోసారి ఫ్రిడ్జ్ లు మెురాయిస్తుంటాయి. సరిగ్గా కూలింగ్ ఇవ్వకుండా.. చికాకు తెప్పిస్తుంటాయి. దీంతో చాలా మంది ఆవేశంతో మెకానిక్ కు ఫోన్ చేసి.. వేల రూపాయలు వదిలించుకుంటూ ఉంటారు. అయితే మెకానిక్ ను పిలిచే ముందు ఒక సులువైన చిట్కాతో ఫ్రిడ్జ్ సమస్యను స్వయంగా కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కూలింగ్ తగ్గడానికి కారణం ఏంటి?

ఫ్రిజ్ లోపల చల్లదనం తగ్గడానికి కంప్రెషర్ లేదా గ్యాస్ లీకేజీ మాత్రమే కారణం చాలామంది భావిస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా సందర్భాలలో ఫ్రిజ్ తలుపుకు ఉండే రబ్బర్ గ్యాస్కెట్ (Rubber Gasket) సరిగ్గా లాక్ అవ్వకపోవడం వల్లనే ఈ సమస్య వస్తుందని పేర్కొంటున్నారు. ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే ఈ రబ్బర్ స్ట్రిప్… లోపలి చల్లటి గాలి బయటకు పోకుండా, బయటి వేడి గాలి లోపలికి రాకుండా చూస్తుంది. అయితే ఇది పాతదైనా లేదా దీనిపై దుమ్ము పేరుకుపోయినా ఫ్రిజ్ తలుపు సరిగ్గా మూతపడదు. దీనివల్ల లోపల కూలింగ్ తగ్గిపోతూ ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

‘పేపర్ టెస్ట్’ ఎలా చేయాలి?

Advertisement

కూలింగ్ లీకేజీ సమస్యను పైసా ఖర్చు లేకుండా కనిపెట్టేందుకు నిపుణులు ఓ అద్భుతమైన ట్రిక్ ను సూచిస్తున్నారు. అదే ‘పేపర్ టెస్ట్’. దీనికోసం మీరు ఒక నోటు పుస్తకంలోని పేపర్ లేదా ఒక కరెన్సీ నోటు వాడొచ్చు. ఈ పేపర్ టెస్టులో భాగంగా ముందుగా ఫ్రిజ్ తలుపు తెరిచి.. చేతిలోని పేపర్ ను సగం బయటకు కనిపించేలా ఫ్రిజ్ డోర్ మధ్యలో పెట్టి డోర్ వేయండి. అనంతరం బయటకు కనిపిస్తున్న ఆ కాగితాన్ని నెమ్మదిగా బయటకు లాగడానికి ప్రయత్నించండి. మీరు పేపర్‌ను లాగుతున్నప్పుడు అది రాకుండా గట్టిగా పట్టుకుని ఉంటే ఫ్రిజ్ డోర్ రబ్బర్ (గ్యాస్కెట్) అద్భుతంగా పనిచేస్తున్నట్లు లెక్క. అప్పుడు కూలింగ్ తగ్గడానికి కారణం రబ్బర్ కాకుండా మరేదైనా టెక్నికల్ సమస్య అయ్యుంటుంది.

పేపర్ తేలిగ్గా వచ్చేస్తే..

ఒకవేళ కాగితం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తే.. ఫ్రిజ్ డోర్ సరిగ్గా మూతపడటం లేదని అర్థం. అలాంటప్పుడు లూజ్ అయిన రబ్బర్ స్థానంలో వెంటనే కొనాల్సిన అవసరంలేదని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా రబ్బర్ ను కొత్తదానిలాగా టైట్ గా మార్చుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం వేడి నీటి చిట్కాను ఉపయోగించాలని హితవు పలుకుతున్నారు. కొద్దిగా వేడి నీటిని తీసుకుని రబ్బర్ గ్యాస్కెట్‌ను తుడవండి లేదా హెయిర్ డ్రైయర్ సాయంతో కాస్త వేడి గాలిని తగిలేలా చేస్తే రబ్బర్ మళ్లీ మెత్తబడి, ఫ్రిజ్ బాడీకి గట్టిగా అతుక్కుంటుందని వివరిస్తున్నారు. ఒకవేళ దుమ్ము, జిడ్డు వల్ల సరిగ్గా లాక్ అవ్వలేదని భావిస్తే.. బేకింగ్ సోడా లేదా సోప్ వాటర్‌తో ఆ రబ్బరును పూర్తిగా క్లీన్ చేయాలని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఎండలు మండుతున్నాయా? క్రోమా ఏసీ ఆఫర్లతో కూల్ అవ్వండి.. ఏకంగా రూ.40,000 వరకు సేవింగ్స్!

రబ్బర్ ఇంకా లూజ్‌గా ఉంటే..

పైన పేర్కొన్న చిట్కాలు పాటించిన తర్వాత మరొక మారు పేపర్ టెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పేపర్ బయటకు రాకుండా స్టిఫ్ గా డోర్ మధ్యనే ఉండిపోతే.. వేడి నీరు లేదా క్లీనింగ్ చిట్కా పనిచేసినట్లు అర్థం. అలా కాకుండా మళ్లీ తేలిగ్గా పేపర్ బయటకు వచ్చినట్లైతే.. అప్పుడు మార్కెట్లో దొరికే కొత్త గ్యాస్కెట్‌ను కొని అమర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదని పేర్కొంటున్నారు. ఒకవేళ రబ్బర్ బాగానే ఉండి కూడా కూలింగ్ అవ్వకపోతే కంప్రెషర్ లేదా థర్మోస్టాట్ సమస్య కావచ్చొని అప్పుడు మాత్రమే మెకానిక్‌ను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: అవినీతిపై సీఎం విజయ్ సర్జికల్ స్ట్రైక్.. లంచగొండులను పట్టిస్తే రూ. 1 లక్ష రివార్డు?

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×