E-Paper
Advertisement

BHIM UPI Cashback: భీమ్ యుపిఐ స్పెషల్ ఆఫర్.. అందరికీ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి

BHIM UPI Cashback: భీమ్ యుపిఐ స్పెషల్ ఆఫర్.. అందరికీ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి
Advertisement

BHIM UPI Cashback| ఇప్పుడు దేశమంతా యుపిఐ చెల్లింపులదే హవా. కిరాణా కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్ వరకు ప్రతి చోట పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పేలను ప్రజలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పాపులర్ డిజిటల్ పేమెంట్ యాప్ BHIM ఈ నెల డిసెంబర్ 2025లో “గర్వ్ సే స్వదేశీ” క్యాంపెయిన్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా సురక్షిత, సులువైన డిజిటల్ పేమెంట్స్ పెంచాలని లక్ష్యం. భీమ్ యూజర్లు యాప్ ద్వారా పేమెంట్స్ చేసే ప్రతిఒక్కరికీ క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ దొరికే ఛాన్స్ ఉంది. అయితే గరిష్ఠంగా మొత్తం రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూజర్లకి థ్యాంక్స్ చెప్పడానికి భీమ్ ఈ ఆఫర్ ప్రకటించింది.

కొత్త, పాత యూజర్లకి ఏం ఆఫర్లు ఉన్నాయి?

కొత్త యూజర్లకి మొదటి డిజిటల్ పేమెంట్‌పై రూ.20 క్యాష్‌బ్యాక్ వస్తుంది (కనీసం రూ.20 ట్రాన్సాక్షన్). పాత యూజర్లు నెలంతా పేమెంట్స్ చేసి మొత్తం రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్ ట్రాన్సాక్షన్ రకం, సంఖ్య బట్టి మారుతుంది.

ఏ పేమెంట్స్‌కి క్యాష్‌బ్యాక్ వస్తుంది?

Advertisement

స్థానిక గ్రోసరీ షాప్‌లలో షాపింగ్, పెట్రోల్/డీజిల్ ఫ్యూయల్ పేమెంట్స్, బస్/మెట్రో టికెట్స్, మొబైల్ రీఛార్జ్‌లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు,.. వీటిలో ఏది చేసినా అన్నీ క్యాష్ బ్యాక్ కు అర్హత ఉన్న లావాదేవీలే. రోజువారీ పేమెంట్స్‌తోనే సులువుగా క్యాష్‌బ్యాక్ సంపాదించొచ్చు.

BHIM యాప్‌లో ఏం ఏం ఫీచర్స్ ఉన్నాయి?

భీమ్ 15కి పైగా భారతీయ భాషలు సపోర్ట్ చేస్తుంది. స్ప్లిట్ ఎక్స్‌పెన్స్ ఫీచర్ ఫ్రెండ్స్ మధ్య బిల్ డివైడ్ చేయడానికి ఉపయోగం. ఫ్యామిలీ మోడ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కంట్రోల్డ్ షేరింగ్ ఇస్తుంది. స్పెండ్ అనలిటిక్స్ ఖర్చులు ట్రాక్ చేస్తుంది. యాక్షన్ నీడెడ్ ఫీచర్ పెండింగ్ పేమెంట్స్ గుర్తు చేస్తుంది.

UPI సర్కిల్ ఫీచర్ ఎలా సాయం చేస్తుంది?

Advertisement

UPI సర్కిల్ ఫీచర్ ఫ్యామిలీ స్పెండింగ్‌కి ఎక్స్‌ట్రా కంట్రోల్ ఇస్తుంది. ఫ్యామిలీ మెంబర్లకి ఫిక్స్‌డ్ లిమిట్‌లో స్పెండ్ చేయడానికి అనుమతి ఇవ్వొచ్చు. పేరెంట్స్ పిల్లలకి లిమిటెడ్ స్పెండింగ్ ఇవ్వొచ్చు. సీనియర్ మెంబర్లకి సురక్షితంగా సాయం చేయొచ్చు.

Also Read: ఇంటర్నెట్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఇలా నివారించండి..

భీమ్ డిజిటల్ పేమెంట్స్‌లో ఏం పాత్ర పోషిస్తుంది?

ప్రపంచ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో 50 శాతం యుపిఐ ద్వారానే జరుగుతున్నాయి. BHIM భారత్ డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌ని బలోపేతం చేస్తుంది. “గర్వ్ సే స్వదేశీ” క్యాంపెయిన్ స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. నగదు రహిత ట్రాన్సాక్షన్స్ పెంచి ప్రజలను దేశ ఆర్థిక వ్యవస్థలో యాక్టివ్ యూజర్లుగా చేస్తుంది.

BHIMతో సురక్షిత, సులువైన డిజిటల్ పేమెంట్స్ చేసి క్యాష్‌బ్యాక్ పొందండి. ఈ ఆఫర్ ఈ నెలతోనే ముగిసిపోతుంది. కాబట్టి త్వరగా వినియోగించుకోండి. ఈ రోజే భీమ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×