Gocartsy portable juicer: ప్రతి రోజూ ఉదయం ఫ్రెష్‌గా జ్యూస్ తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే.. పెద్ద పెద్ద మిక్సర్లు మోసే పని లేకుండా మార్కెట్లోకి వచ్చేసింది ఈ మోడల్. కేవలం రూ.630 అద్భుతమైన ధర వద్ద లభిస్తున్న ఈ మినీ పోర్టబుల్ జ్యూసర్, మీ ప్రయాణాలను మరింత ఆరోగ్యకరంగా మార్చేస్తుంది. 50W శక్తితో పని చేసే ఈ ట్రెండీ గాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి ఫీచర్లు:
కాంపాక్ట్ డిజైన్, పోర్టబిలిటీ:
ఈ జ్యూసర్ ప్లస్ పాయింట్ దీని డిజైన్. ఇది చాలా చిన్నదిగా,తేలిక పాటి బరువుతో ఉంటుంది. దీన్ని మీ హ్యాండ్ బ్యాగ్, ఆఫీసు బ్యాగ్ లేదా లగేజ్‌లో.. చాలా ఈజీగా సర్దుకోవచ్చు. మీరు ఆఫీసులో ఉన్నా.. జిమ్‌లో వర్కౌట్ చేసినా, లేదా ట్రిప్స్‌కు వెళ్లినా సరే దీన్ని మీతో .. పాటు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయవచ్చు.దీని మోడర్న్ లుక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
పనితీరు,శక్తి:
ఇది కేవలం చిన్న సైజులోనే కాకుండా.. మంచి పని తీరును కూడా అందిస్తుంది. ఇందులో ఉన్న 50 వాట్ల మోటార్ పండ్లు, కూరగాయలను త్వరగా బ్లెండ్ చేయడానికి .. సహాయ పడుతుంది. తాజా పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లు, ప్రోటెన్ షేక్‌లు , స్మూతీలను క్షణాల్లో.. తయారు చేసుకోవచ్చు. బ్లేడ్ల క్వాలిటీ బాగుండటం వల్ల జ్యూస్ చాలా స్మూత్‌గా వస్తుంది.
ఛార్జింగ్, వైర్‌లెస్ సౌకర్యం:
ఇది వైర్‌లెస్, రీచార్జబుల్ ఫీచర్‌తో పని చేస్తుంది. అంటే.. దీనికి ఎప్పుడూ.. కరెంట్ వైర్ లేదా ప్లగ్ పాయింట్ అవసరం లేదు. యూఎస్‌బీ కేబుల్ సాయంతో.. దీన్ని ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్ లేదా మొబైల్ ఛార్జర్‌తో.. ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక సారి పూర్తి ఛార్జ్ చేస్తే ప్రయాణాల్లో.. పలు మార్లు జ్యూస్ తయారు చేసుకునే వెసులు బాటు ఉంటుంది.
శుభ్రం చేయడం చాలా సులువు :
సాధారణ మిక్సర్లు లేదా పెద్ద జ్యూసర్లను శుభ్రం చేయడం పెద్ద ప్రయాసతో.. కూడుకున్న పని. కానీ ఈ పోర్టబుల్ జ్యూసర్‌ను శుభ్రం చేయడం చాలా బెస్ట్. దీని విడిభాగాలను విడదీయడం ఈజీ కాబట్టి, నీటితో క్షణాల్లో శుభ్రం చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉండే.. వారికి ఇది పర్ఫెక్ట్ కిచెన్ గాడ్జెట్.
ధర :
ఇన్ని ఉపయోగకరమైన ఫీచర్లు కలిగిన ఈ మోడల్ ప్రస్తుత మార్కెట్లో కేవలం రూ.630 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. పోర్టబుల్ జ్యూసర్ లభించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
తక్కువ బడ్జెట్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి, ఎల్లప్పుడూ ఫ్రెష్ జ్యూస్‌లు తాగాలని కోరుకునే వారికి ఈ పోర్టబుల్ జ్యూసర్ ఒక అద్భుతమైన ఆప్షన్. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో లభించే ఈ ట్రెండీ గాడ్జెట్‌ను కొని, మీ హెల్తీ లైఫ్‌స్టైల్‌కు శ్రీకారం చుట్టండి!