Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రయాణాన్ని ఆయన ‘తీర్థయాత్ర’తో పోల్చారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సామాన్య ప్రజలు చేస్తున్న అసాధారణమైన కృషిని ప్రశంసించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం మన్ కీ బాత్ 139వ సంచికలో మాట్లాడిన ప్రధాని.. గత పుష్కర కాలంగా ఈ కార్యక్రమానికి ప్రజలు అందిస్తున్న ఆప్యాయత, అభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని ప్రతి మూల నుంచి ఎంతోమంది సామాన్యులు చేస్తున్న సేవలు, సమాజం గుర్తించని వారి అద్భుతమైన కథలను నలుదిక్కులకూ చాటిచెప్పడానికి మన్ కీ బాత్ ఒక దివ్యమైన అవకాశంగా మారిందని ప్రధాని అన్నారు. ‘మన దేశంలో తీర్థయాత్రలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ అనేది దేశ ప్రజల కృషిని దగ్గరుండి అర్థం చేసుకోవడానికి, వారి సహకారానికి గుర్తింపునిచ్చే వేదిక. ఇది తీర్థయాత్ర కంటే తక్కువేమీ కాదు. సమాజం కోసం, దేశం కోసం జీవించే ప్రజలు పుణ్యక్షేత్రాలతో సమానం’ అని ప్రధాని అన్నారు.
Also Read: ‘ఆ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తే లేదు’.. జేడీయూ వేటుపై అనంత సింగ్ ఫైర్!
మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం లభించిందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ‘మన్ కీ బాత్’ వింటున్నప్పుడు ప్రధాని తమ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని ఎంతోమంది శ్రోతలు తనకు సందేశాలు పంపుతుంటారని ఆయన గుర్తుచేసుకున్నారు. శ్రోతలు చూపిస్తున్న ఈ ప్రేమ, ఆప్యాయతలే తనకు లభించిన అత్యంత విలువైందని ప్రధాని వ్యాఖ్యానించారు.
Also Read: కత్తి అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు.. ఫ్రీజర్ మంచును ఈజీగా క్లీన్ చేసే సింపుల్ టిప్స్!