E-Paper
Advertisement

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Advertisement

El Niño: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పంట నష్టం,వర్షపాత లోటు తీవ్రతను అంచనా వేయడం లో భాగంగా చివరికి 20 శాతం మేర ప్రభావం ఉన్న మండలాలను సైతం ఈ జాబితాలోకి చేర్చే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గరిష్ఠ స్థాయిలో సహాయ పునరావాస నిధులు రప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర యంత్రాంగం యుద్ధపాతిపదికన చర్యలు వేగవంతం చేసింది. కేవలం రెండు రోజుల్లో నివేదికలు అందించాలని ప్రభుత్వం శతస్థాయి అధికారులకు ఆదేశాలుఇచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులు, వర్షాభావ ప్రాంతాలపై స్పష్టమైన అంచనాకు రావాలని సర్కార్ జిల్లాల అధికారులను ఆదేశించింది.అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, రాబోయే రెండు రోజుల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అధిక శాతంలో నష్టం..

పంట నష్టం అంచనా.. చిన్న రైతుల నష్టపోకుండా..? సాధారణ వర్షపాతం కంటే తక్కువ పడిన మండలాలు, భూగర్భ జలాలు పడిపోయిన ప్రాంతాలు, విత్తనాలు వేసి పంట ఎండిపోయిన ఎకరాల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ఇక సాధారణంగా కరువు మండలాలను గుర్తించేటప్పుడు అధిక శాతంలో నష్టం జరిగిన ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈసారి ప్రభుత్వం భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎల్ నినో ప్రభావం కనీసం 20 శాతం ఉన్న మండలాలను కూడా ‘ఎఫెక్టివ్ మండలాలు’గా పరిగణించి జాబితాలో చేర్చాలనినిర్ణయించారు.స్వల్పంగా నష్టపోయిన ప్రాంతాలనూ వదలకుండా ప్రతిపాదనల్లో చేర్చడం ద్వారా, ఆయా మండలాల రైతులకు ఉపాధి హామీ పనులు, విత్తన రాయితీలు, అప్పుల పునర్వ్యవస్థీకరణ వంటి ప్రయోజనాలు అందేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Also read: దక్షి ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఈమె ఎంత సంపాదించిందంటే?

ఈ నెల 31 వరకు కేంద్రానికి తుది జాబితా..

కేంద్ర విపత్తు నిర్వహణ నిధి , నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి భారీగా నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, ఈ నెల 31వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఎల్ నినో బాధిత్ మండలాల తుది జాబితాను అందజేయనున్నారు. అంతేకాకుండా రిపోర్ట్ సమర్పించిన వెంటనే కేంద్ర అధ్యయన బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేలా ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. కేంద్రానికి పంపే నివేదికలో కేవలం పంట నష్టమే కాకుండా ఇతర సహాయ ప్రతిపాదనలను కూడాపొందుపరుస్తున్నారు.

100 నుండి 150 రోజులు..

Advertisement

ఎండిపోయిన పంటలకు ఎకరాకు నిర్దిష్ట పరిహారం చెల్లించడానికి సహాయం కోరనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడి నివారణకు, పశుగ్రాసం సరఫరాకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులకు ఉచిత,రాయితీ విత్తనాల పంపిణీకి బడ్జెట్ కోరనున్నారు. అంతేగాక కరువు ప్రభావిత మండలాల్లో పనిదినాలను 100 నుండి 150 రోజులకు పెంచేలా అనుమతులను ఇప్పటికే కోరారు.

Also Read: గుత్తి దొండకాయ కూర ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు!

Tags

Related News

టీజీ-ఐపాస్ సర్వర్‌ హ్యాక్.. హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారో తెలిస్తే షాకవుతారు!

టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!

మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్

హైదరాబాద్ ‘సిటీ’వాసులకు సూచన.. కేవలం రూ.600 లకే బస్సు పాస్, ఇంకెందుకు ఆలస్యం

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

Big Stories

Advertisement
×