E-Paper
Advertisement

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!
Advertisement

Google Chrome Update: ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది ఉపయోగించే గూగుల్ క్రోమ్‌కు కొత్త అప్‌డేట్ వచ్చింది. Chrome 156 వెర్షన్‌లో 353 భద్రతా లోపాలకు పరిష్కారాలు అందించినట్లు సమాచారం. వీటిలో 6 అత్యంత కీలకమైన లోపాలు కూడా ఉన్నాయి. విండోస్, మ్యాక్, లైనక్స్ కంప్యూటర్లలో క్రోమ్ వాడుతున్న వారు ఈ అప్‌డేట్‌ను వీలైనంత త్వరగా ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. బ్రౌజర్‌లోని కొన్ని లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు దాడులు చేసే ప్రమాదం ఉండటంతో ఈ అప్‌డేట్‌‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.

కొత్త అప్‌డేట్..

ఈ కొత్త వెర్షన్‌లో క్రోమ్‌లోని పలు భాగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. ముఖ్యంగా గ్రాఫిక్స్, వెబ్ పేజీల డిజైన్, వెబ్‌ఆర్‌టీసీ, యాక్సెసిబిలిటీ ఫీచర్లలో ఉన్న లోపాలపై దృష్టి పెట్టారు. ఈ సమస్యల వల్ల బ్రౌజర్ క్రాష్ కావడం లేదా కొన్ని పరిస్థితుల్లో హానికరమైన కోడ్ అమలయ్యే ప్రమాదం ఉండొచ్చు. అందుకే కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

Advertisement

Also Read: యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

ఆరు కీలక లోపాలు..

ఈ ఆరు లోపాల్లో ఐదు మెమరీ నిర్వహణకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇవి స్కియా గ్రాఫిక్స్ ఇంజిన్, CSS, పెయింటింగ్, వెబ్‌ఆర్‌టీసీ వంటి భాగాలకు సంబంధించినవి. మరో లోపం యాక్సెసిబిలిటీ ఫీచర్‌లో గుర్తించిన యూజ్-ఆఫ్టర్-ఫ్రీ సమస్య. అంటే.. విడుదల చేసిన మెమరీని బ్రౌజర్ మళ్లీ ఉపయోగించడానికి ప్రయత్నించే పరిస్థితి ఏర్పడొచ్చు. ఈ లోపాలపై పూర్తి వివరాలను గూగుల్ ఇంకా వెల్లడించలేదు. వీటిని ఉపయోగించి దాడులు జరిగాయా లేదా అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు.

అప్‌డేట్ ఇలా..

Advertisement

ముందుగా మీ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేసి, Help విభాగంలో About Google Chrome ఎంపికను తెరవండి. అప్పుడు బ్రౌజర్ కొత్త అప్‌డేట్ కోసం తనిఖీ చేస్తుంది. అప్‌డేట్ అందుబాటులో ఉంటే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ పూర్తయ్యాక Relaunch బటన్ నొక్కండి. అప్పుడు కొత్త వెర్షన్ అమల్లోకి వస్తుంది.

వెర్షన్ చెక్..

లైనక్స్‌లో 156.0.8078.47 వెర్షన్, విండోస్, మ్యాక్‌లో 156.0.8078.47 లేదా 156.0.8078.48 కనిపించవచ్చు. మీ బ్రౌజర్‌లో ఈ వెర్షన్లు కనిపించకపోతే అప్‌డేట్ ఇంకా అందుబాటులోకి రాకపోయి ఉండొచ్చు. ఆఫీసుల్లో ఐటీ నిర్వాహకులు కూడా ఉద్యోగుల కంప్యూటర్లలో అప్‌డేట్ చేసి, బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయించాలి. తాజా వెర్షన్‌ను ఉపయోగించడం ద్వారా తెలిసిన భద్రతా లోపాల నుంచి రక్షణ పొందవచ్చు.

Also Read: సైజులో చిన్నదే.. హెల్త్ ఫీచర్లు మాత్రం బోలెడు, Oura Ring 5 భారత్‌లోకి వచ్చేసింది!

Tags

Related News

రూ.646కే పార్టీ వైబ్స్! దీని ఆర్జీబీ లైట్లతో మీ వైబ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

మీ మెయిల్‌కి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!

సైజులో చిన్నదే.. హెల్త్ ఫీచర్లు మాత్రం బోలెడు, Oura Ring 5 భారత్‌లోకి వచ్చేసింది!

ChatGPTలో పర్సనల్ చాట్స్ లాకింగ్ ఫీచర్ వచ్చేసింది.. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు!

ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవట్లేదా? కొత్త ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

Big Stories

Advertisement
×