Gary Kirsten Warns Pakistan Team: పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) నేపథ్యంలో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నిన్న ఇంగ్లాండ్ పై 429 పరుగుల టార్గెట్ ను కూడా లంక ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు శ్రీలంక హెడ్ కోచ్ గారీ క్రిస్టెన్ ( Gary Kirsten) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తగిన బుద్ధి చెబుతానని… ఈ ట్రై సిరీస్ లో ఆ జట్టును ఓడించి ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే తాను తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంగ్లాండ్ పై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత గారీ క్రిస్టెన్ డ్రెస్సింగ్ రూమ్ లో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య ట్రై సిరీస్ లో భాగంగా రావల్పిండి వేదికగా మూడో వన్డే జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లు ఆడి 429 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ విజయం నల్లేరు మీద నడకగా సాగుతుందని అందరూ భావించారు. కానీ లంక ప్లేయర్లు గట్టిగానే పోరాడారు. హెడ్ కోచ్ గారీ క్రిస్టెన్ ( Gary Kirsten) సూచనలను తీసుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
ఈ క్రమంలోనే ఓ బంతి మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది శ్రీలంక. ఈ విజయం సాధించిన శ్రీలంక, వన్డే క్రికెట్ హిస్టరీలో భారీ టార్గెట్ చేదించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు లంక హెడ్ కోచ్ గారీ క్రిస్టెన్ ( Gary Kirsten) . తనను అవమానించిన పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ శ్రీలంకకు అందించి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు.
అసలు శ్రీలంక గారీ క్రిస్టెన్ కు ఉన్న గొడవ ఏంటి ?
2024 ఏప్రిల్ లో పాకిస్తాన్ క్రికెట్ కోచ్ గా గారీ క్రిస్టెన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే రెండు సంవత్సరాల ఒప్పందం ఉన్నప్పటికీ ఆరు నెలల్లోనే ఆయన రాజీనామా చేశారు. పాకిస్తాన్ జట్టులో పదే పదే పీసీబీ అధికారులు జోక్యం చేసుకోవడంతో అతడు తప్పుకున్నారు. ప్లేయర్ల ఎంపికలో నఖ్వీ తనను అవమానించాడని రాజీనామా చేసిన తర్వాత గారీ క్రిస్టెన్ కూడా బహిరంగంగా వెల్లడించారు. దీంతో వీళ్ళ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.