Oura Ring 5: స్మార్ట్‌వాచ్ లేకుండానే ఆరోగ్యాన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే Oura Ring 5 మీరు కొనుగోలు చేయదగ్గ బెస్ట్ ఆప్షన్. ఔరా కంపెనీ భారత్‌లో తమ కొత్త స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే.. చిన్న డిజైన్, మెరుగైన సెన్సర్లు, AI ఆధారిత హెల్త్ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన సంకేతాలను గమనించడం నుంచి నిద్రలో శ్వాస మార్పులను ట్రాక్ చేయడం వరకు ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మరి దీని ధర ఎంత? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దామా..
భారత్‌లో Oura Ring 5 ధర సిల్వర్, బ్లాక్ రంగులకు రూ.39,900 నుంచి మొదలవుతుంది. గోల్డ్, డీప్ రోజ్, స్టెల్త్, బ్రష్డ్ సిల్వర్ రంగుల ధర రూ.50,900గా ఉంది. ఇది 6 నుంచి 13 సైజుల్లో లభిస్తుంది. రింగ్‌తో పాటు దానికి సరిపోయే ఛార్జర్ కూడా వస్తుంది. ప్రస్తుతం అమెజాన్, క్రోమా స్టోర్లలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అదనపు ఫీచర్ల కోసం నెలకు రూ.599తో మెంబర్‌షిప్ తీసుకోవచ్చు.
Also Read: ChatGPTలో పర్సనల్ చాట్స్ లాకింగ్ ఫీచర్ వచ్చేసింది.. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు!
ఈ రింగ్‌లో టైటానియం బాడీని ఉపయోగించారు. ఇది Oura Ring 4 కంటే 40 శాతం చిన్నగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గీతలు పడకుండా మెరుగైన కోటింగ్ ఇచ్చారు. IP68 రేటింగ్‌తో పాటు 100 మీటర్ల వరకు నీటిని తట్టుకునే సామర్థ్యం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రింగ్ సైజు, వాడకాన్ని బట్టి తొమ్మిది రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
Oura Ring 5లో Health Radar ప్రత్యేక ఆకర్షణ. ఇది శరీరంలో వచ్చే మార్పులను గమనించి, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఒత్తిడి సంకేతాలను గుర్తించడంలో సాయం చేస్తుంది. నిద్రలో శ్వాస మార్పులను కూడా ట్రాక్ చేస్తుంది. గత 30 రోజుల శ్వాస సంబంధిత వివరాలను పరిశీలించవచ్చు. అయితే, బీపీ సంకేతాల ట్రాకింగ్ సాధారణ రక్తపోటు పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు.
ఔరా యాప్‌లో Live Activity Tracking ద్వారా వ్యాయామాన్ని గమనించవచ్చు. AI Advisor వ్యక్తిగత ఆరోగ్య సూచనలు అందిస్తుంది. Health Records ఫీచర్ వైద్య వివరాలను రింగ్ డేటాతో కలిపి చూపిస్తుంది. GLP-1 మందులు వాడేవారి కోసం ప్రత్యేక ఇన్‌సైట్స్ ఉన్నాయి. రింగ్ లేదా ఛార్జర్ కనిపించకపోతే Locate ఫీచర్‌తో వెతకవచ్చు. అలాగే, అవసరమైన కాలానికి చెందిన ఆరోగ్య సమాచారాన్ని తొలగించే Data Deletion టూల్ కూడా ఉంది. అయితే, కొన్ని ఫీచర్లకు మెంబర్‌షిప్ అవసరం కావచ్చు.
Also Read: రూ.10 వేలకే కొత్త ఫ్లిప్ ఫోన్.. ఇందులో ఉన్న ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!