E-Paper
Advertisement

అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను వదిలిపెట్టనున్న గూగుల్.. ఇదెక్కడి ప్లాన్ మామ?

అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను వదిలిపెట్టనున్న గూగుల్.. ఇదెక్కడి ప్లాన్ మామ?
Advertisement

Google Mosquito Project: సాధారణంగా దోమల నివారణ అనగానే మనకు గుర్తొచ్చేది కెమికల్ స్ప్రేలు, పొగ వేయడం వంటివి. కానీ వీటన్నింటికీ చెక్ పెడుతూ.. సరికొత్త బయోలాజికల్, ఆటోమేషన్ టెక్నాలజీతో ప్రపంచంలోనే అతిపెద్ద దోమల నియంత్రణ ప్రయోగానికి తెరలేచింది. గూగుల్ మద్దతుతో నడుస్తున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పుడు అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ వినూత్న ప్రయోగాని సంబంధించిన విశేషాలు? అది ఏ విధంగా పనిచేస్తుంది? వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

‘వోల్బాచియా’ మాయాజాలం!

గూగుల్ కు చెందిన సైన్స్ విభాగం.. ఈ దోమల ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో గేమ్ ఛేంజింగ్ గా ‘వోల్బాచియా’ (Wolbachia) అనే ఒక సహజసిద్ధమైన బాక్టీరియా నిలవబోతోంది. శాస్త్రవేత్తలు ల్యాబ్‌లలో మిలియన్ల కొద్దీ మగ దోమలను పెంచి.. వాటి శరీరంలోకి ఈ వోల్బాచియా బాక్టీరియాను ప్రవేశపెడుతున్నారు. ఈ బ్యాక్టీరియా కలిగిన మగ దోమలను ప్రకృతిలోకి విడుదల చేసినప్పుడు.. అవి బయట ఉన్న ఆడ దోమలతో జతకడతాయి. పైగా దోమలు పెట్టే గుడ్లను ఇవి పొదగకుండా నిర్జీవంగా మార్చేస్తాయి. ఫలితంగా కొత్త దోమలు పుట్టుకురావు. దీనివల్ల కాలక్రమేణా ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే దోమల జనాభా తగ్గిపోతుందని గూగుల్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

రంగంలోకి ఏఐ టెక్నాలజీ

Advertisement

గూగుల్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మగదోమలు చాలా కీలకం. అయితే మిలియన్ల కొద్దీ దోమల్లో మగ దోమలను, ఆడ దోమలను వేరు చేయడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. ఇక్కడే గూగుల్ తన ఏఐ సాంకేతికతను రంగంలోకి దింపింది. అత్యాధునిక ఏఐ సిస్టమ్స్, ఆటోమేషన్ రోబోల సాయంతో కోట్లాది దోమలను క్షణాల్లో స్క్రీనింగ్ చేసి కేవలం మగ దోమలను మాత్రమే పక్కాగా వేరు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా వందల రెట్లు వేగంతో ఈ ప్రక్రియ సాగుతోంది.

అమెరికాలోకి 3.2 కోట్ల దోమలు!

దోమలకు చెక్ పెట్టే ప్రాజెక్ట్ ను గూగుల్ ఇప్పటికే ఇతర దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అవి అద్భుతమైన ఫలితాలను సైతం అందించాయి. డెంగ్యూ, జీకా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వోల్బాచియా పద్ధతి విజయవంతమైందని గూగుల్ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అదే ఊపుతో అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో పెంచిన 3.2 మిలిట్లు (3.2 కోట్లు) దోమలను రాబోయే రెండేళ్లలో విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వాన్ని గూగుల్ కోరుతున్నట్లు డీబగ్ వెబ్ సైట్ పేర్కొంది.

Advertisement

Also Read: కూలర్‌లో నీళ్లు పోస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. కరెంటు షాక్ పక్కా!

పర్యావరణానికి సురక్షితం

సాంప్రదాయ రసాయన స్ప్రేల వల్ల దోమలతో పాటు పర్యావరణానికి, ఇతర జీవులకు నష్టం జరుగుతోంది. పైగా దోమలు ఆ కెమికల్స్‌కు అలవాటు పడి (Resistance) చావడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. గూగుల్ అభివృద్ధి చేసిన ఈ బయోలాజికల్ విధానం వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకపోగా.. దోమల జనాభా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై మానవాళి చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఈ గూగుల్ బ్యాక్డ్ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. సైన్స్, టెక్నాలజీ చేతులు కలిపితే ప్రకృతిని పాడుచేయకుండానే.. ప్రాణాంతక జీవుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో చెప్పడానికి ఈ ప్రయోగమే ఒక సజీవ సాక్ష్యమని అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఆంధ్రుల విగ్రహాలు పగలగొట్టి.. ఏపీకి పార్సిల్ పంపిస్తాం.. కవిత సంచలన కామెంట్స్

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×