E-Paper
Advertisement

Google Photos AI: గూగుల్ ఫోటోస్‌లో AI ఎడిటింగ్.. కేవలం వాయిస్‌తో ఫోటోలు ఎడిట్

Google Photos AI: గూగుల్ ఫోటోస్‌లో AI ఎడిటింగ్.. కేవలం వాయిస్‌తో ఫోటోలు ఎడిట్
Advertisement

Google Photos AI| ఇండియాలో గూగుల్ కంపెనీ సరికొత్తగా గూగుల్ ఫోటోస్‌కు కొత్త AI పవర్డ్ ఎడిటింగ్ ఫీచర్ తీసుకురోబోతోంది. కేవలం వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్స్‌తో ఫోటోలు ఎడిట్ చేయవచ్చు. మాన్యువల్‌గా టూల్స్ వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి మార్పులు కావాలో సింపుల్‌గా చెబితే చాలు ఫోటో మీకు కావాల్సిన విధంగా మార్చేస్తుంది. గూగుల్ ప్రకారం ఈ అప్‌డేట్.. ఫోటో ఎడిటింగ్‌ను వేగంగా, సహజంగా చేస్తుంది.

జెమిని AIతో పవర్‌తో వచ్చే ఫీచర్

ఈ ఫీచర్ అడ్వాన్స్‌డ్ జెమిని AI టెక్నాలజీతో నడుస్తుంది. నేచురల్ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకుని యూజర్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఎడిట్స్ చేస్తుంది. గూగుల్ ఫోటోస్‌లో ఏ ఫోటోనైనా ఓపెన్ చేసి “హెల్ప్ మీ ఎడిట్” ఆప్షన్ ట్యాప్ చేయండి. టైప్ చేయండి లేదా సులభంగా మీకు కావల్సిన మార్పులు నోటితో చెప్పండి. ఉదాహరణకు: “సన్‌గ్లాసెస్ తీసేయండి”, “కళ్లు తెరవండి”, “స్మైల్ యాడ్ చేయండి” అని చెప్పవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, స్టైల్ మార్చడం ఇదే విధంగా సాధ్యం.

స్మార్ట్, పర్సనలైజ్డ్ ఎడిటింగ్

Advertisement

ఫేస్ గ్రూప్స్‌తో పనిచేసి కచ్చితమైన ఎడిట్స్ ఇస్తుంది. ప్రైవసీ కోసం గూగుల్ సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్‌లోనే ఎడిటింగ్ చేస్తుంది. పర్సనల్ డేటా బయటకు వెళ్లదు.

నానో బనానా టూల్‌తో క్రియేటివ్ స్టైల్స్

కొత్త “నానో బనానా” టూల్ ఒకే సెంటెన్స్‌తో ఫోటో స్టైల్ మార్చేస్తుంది.
లైటింగ్, మూడ్, ఆర్టిస్టిక్ స్టైల్ సులభంగా మార్చవచ్చు.
సోషల్ మీడియా, క్రియేటివ్ ప్రాజెక్ట్‌లకు ఉపయోగకరం.
కాంప్లెక్స్ ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు.

AI జనరేటెడ్ కంటెంట్‌కు డిజిటల్ లేబుల్స్

Advertisement

గూగుల్ C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్ సపోర్ట్ చేస్తోంది. ఎడిట్ చేసిన ఫోటోలకు డిజిటల్ లేబుల్ యాడ్ అవుతుంది. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఎడిట్స్ జరిగాయో చూపిస్తుంది. AI జనరేటెడ్ లేదా మార్చిన కంటెంట్‌ను గుర్తించడం సులభమవుతుంది.

Also Read: మీ ఫోన్‌లో ఓటీపీ మెసేజ్‌లు కనిపించడం లేదా? ఇలా చేయండి

భాషలు, డివైస్ సపోర్ట్

ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరాఠీ, తెలుగు, బెంగాలీ, గుజరాతీలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 8.0 లేదా తర్వాతి వెర్షన్, 4GB RAM ఉన్న డివైస్‌లలో పనిచేస్తుంది. అప్‌డేట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎక్స్‌ట్రా యాప్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.

ఫోటో ఎడిటింగ్‌ ప్రక్రియను గూగుల్ చాలా సులభతరం చేసింది. వాయిస్, టెక్స్ట్ ఎడిటింగ్‌తో టెక్నికల్ అడ్డంకులు తొలగించేసింది. జెమిని AIతో ఎడిటింగ్ సహజంగా, మీరు కోరుకున్నట్లు మారిపోతుంది. గూగుల్ ఫోటోస్ ఇప్పుడు పవర్‌ఫుల్ క్రియేటివ్ టూల్ అయింది. మొబైల్ ఫోటో ఎడిటింగ్‌కు ఇండియాలో గూగుల్ కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×