E-Paper
Advertisement

Google Pixel 10a: పిక్సెల్ 10ఎ లాంచ్‌కు కౌంట్‌డౌన్… డిజైన్ నుంచి ధర వరకు పూర్తి వివరాలు

Google Pixel 10a: పిక్సెల్ 10ఎ లాంచ్‌కు కౌంట్‌డౌన్… డిజైన్ నుంచి ధర వరకు పూర్తి వివరాలు
Advertisement

Google Pixel 10a : పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ లాంటి హైఎండ్ మోడల్స్ రిలీజ్ చేసిన గూగుల్, ఇప్పుడు అదే సిరీస్‌లో మరింత అందుబాటులో ఉండే కొత్త ఫోన్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ఎవాన్ బ్లాస్ చెప్పిన సమాచారం ప్రకారం, పిక్సెల్ 10ఎ అమెరికాలోని వెరిజోన్ సర్టిఫికేషన్ క్లియర్ చేసుకుంది. ఈ సర్టిఫికేషన్ అన్నది సాధారణంగా లాంచ్ చాలా దగ్గర్లో ఉందని చెప్పే బలమైన సంకేతంగా భావిస్తారు. అంతేకాదు, బయటపడిన డాక్యుమెంట్స్‌లో ఉన్న వివరాలు ఈ మిడ్‌రేంజ్ ఫోన్ ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ ఐడియాను ఇస్తున్నాయి.

పిక్సెల్ 9ఎ ..డిజైన్ – డిస్‌ప్లే.. రిపీట్

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, పిక్సెల్ 10ఎ, పిక్సెల్ 9ఎ లుక్‌ను ఎక్కువగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. గూగుల్‌కే ప్రత్యేకమైన క్లీన్ట్ స్టైల్, వెనకాల ఉండే కామెరా బార్, రౌండెడ్ కార్నర్స్ అన్నీ క్లారిటీగా ఉండేలా డిజైన్ చేశారు. డిస్‌ప్లే కూడా చాలా వరకు పిక్సెల్ 9ఎ స్థాయినే రిపీట్ చేసేలా కనిపిస్తోంది. లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఏఎమ్ఓఎల్ఈడి స్క్రీన్‌తో రావొచ్చు అన్నది తెలుస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 నుంచి 120Hz మధ్య మారుతుంది, అంటే రోజూవారీ వాడకంలో స్మూత్ అనుభవం ఇస్తుందన్న మాట. మరో ఆసక్తికర విషయం, దీని పీక్ బ్రైట్‌నెస్ 2,000 నిట్స్‌ వరకు వెళ్లొచ్చు అనే సమాచారం రావడం. అంటే బయట ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించే అవకాశాలు తగినంతగా ఉంటాయి.

48 మెగాపిక్సెల్స్ కెమెరా

Advertisement

కామెరా సెక్షన్‌లో కూడా గూగుల్ పెద్దగా మార్పులు చేయనట్లు కనిపిస్తోంది. 48 మెగాపిక్సెల్స్ మెయిన్ సెన్సర్, 13 మెగా పిక్సెల్స్ అల్ట్రావైడ్ ఈ రెండు లెన్స్‌ల కలయికనే మళ్లీ కొనసాగించొచ్చని లీక్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఫ్రంట్‌లో 13 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, పిక్సెల్ ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి సాఫ్ట్‌వేర్ ప్రయోజనాలు ఈ ఫోన్‌కూ అక్కడక్కడా సపోర్ట్ ఇస్తాయి.

Also Read: Starlink vs Jio vs Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు కొత్త ఛాలెంజ్.. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్‌నెట్ ఇండియాలో ఎంట్రీ ..

పర్‌ఫార్మెన్స్ .. బ్యాటరీ కెపాసిటీ 5,100 ఎంఏహెచ్

పర్‌ఫార్మెన్స్ వైపుకు వస్తే, గూగుల్ ఇంటర్నల్‌గా తయారు చేసిన టెన్సర్ జి4 చిప్‌సెట్ ఇవ్వబోతున్నారని బలమైన సమాచారం. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వంటి స్పెసిఫికేషన్లు ఈ ఫోన్‌ను మిడ్‌రేంజ్ కేటగిరీ రంగంలో నిలిచేలా చేస్తాయి. బ్యాటరీ కెపాసిటీ 5,100 ఎంఏహెచ్ వద్దే కొనసాగుతుందని సమాచారం. 5జీ, ఎల్టీఈ క్యాట్ 19 స్పీడ్స్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయని అంచనా. ముఖ్యంగా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలో శామ్‌సంగ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తుందని టాక్, దాంతో 7 సంవత్సరాల అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ధర.. లాంచ్ ఎప్పుడు?

లాంచ్ గురించి మాట్లాడితే, గూగుల్ సాధారణంగా ఏ సిరీస్‌ను సంవత్సరపు మొదటి భాగంలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. అంటే పిక్సెల్ 10ఎ 2026 మార్చ్ సమయానికే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ధర విషయంలో కూడా గత సారి పిక్సెల్ 9ఎ పెట్టిన రేంజ్‌ను అనుసరిస్తుందని సమాచారం. అందుకే ఇండియా ధర సుమారు రూ. 49,999 చుట్టూ ఉండొచ్చు. అమెరికాలో 499 డాలర్లకు, దుబాయ్ మార్కెట్లో AED 1,829 ధరకు రావొచ్చని టెక్ సోర్స్‌లు చెబుతున్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×