E-Paper
Advertisement

గూగుల్‌లో మీకంటూ ఒక ప్రత్యేక ప్రొఫైల్‌.. ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసా?

గూగుల్‌లో మీకంటూ ఒక ప్రత్యేక ప్రొఫైల్‌.. ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసా?
Advertisement

Google Search Profiles: ఈ డిజిటల్ ప్రపంచంలో క్రియేటర్స్, పబ్లిషర్స్‌కు తమ కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే Search Profiles. ఈ కొత్త ఫీచర్ ద్వారా పబ్లిషర్స్, క్రియేటర్స్ గూగుల్ సెర్చ్, డిస్కవర్ ఫీడ్స్‌లో తాము ఎలా కనిపించాలో స్వయంగా నియంత్రించుకోవచ్చు. తమ లేటెస్ట్ కంటెంట్, సోషల్ మీడియా పోస్టులను ఒకే చోట ప్రదర్శించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఎవరెవరు అర్హులు?

ప్రస్తుతానికి ఈ సరికొత్త ఫీచర్ అమెరికాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారుల వయసు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో కనీస ఫాలోవర్ల సంఖ్యను కలిగి ఉండాలి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలలో కనీసం ఒక లక్ష మంది ఫాలోవర్లు ఉండాలి. ఒకవేళ టిక్‌టాక్ అయితే కనీసం మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నవారు మాత్రమే ఈ ఫీచర్‌ను వాడుకోవడానికి అర్హులు.

Advertisement

Also Read: గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన Honor Magic V6 ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు అమోఘం.. మీరూ ఓ లుక్కేయండి!

ప్రొఫైల్ ఎలా పనిచేస్తుంది?

ఈ Search Profiles మొబైల్ వినియోగదారులకు గూగుల్ నాలెడ్జ్ ప్యానల్స్, డిస్కవర్ ఫీడ్ లేదా డైరెక్ట్ యూఆర్ఎల్ ద్వారా కనిపిస్తాయి. దీనివల్ల ఫాలోవర్లు తమకు నచ్చిన క్రియేటర్లను సులభంగా ఫాలో అవ్వచ్చు. గూగుల్ ఇప్పటికే ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసిన ప్రొఫైల్‌ను యూజర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా తమ సోషల్ మీడియా ఖాతాలను లింక్ చేసి కొత్త ప్రొఫైల్‌ను తయారు చేసుకోవచ్చు. దీనిలో అవతార్, బయో, వెబ్‌సైట్ లింక్స్ వంటి వివరాలతో ప్రొఫైల్‌ను నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

సెటప్ చేసుసుకోవడమెలా?

Advertisement

కొత్త సెర్చ్ ప్రొఫైల్‌ను సెటప్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం ముందుగా గూగుల్ నిర్దేశించిన అఫీషియల్ లింక్‌లోకి వెళ్లి, మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన ఫాలోవర్ల సంఖ్య ఉన్న సోషల్ మీడియా ఖాతాను లింక్ చేసి, క్రియేట్ ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. గూగుల్ ఇప్పటికే ప్రొఫైల్ క్రియేట్ చేసిందో లేదో కూడా సెర్చ్ నాలెడ్జ్ ప్యానల్ పక్కన ఉండే View Search Profile ద్వారా సరిచూసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.

Also Read: మీ ఫోన్ కెమెరా నార్మల్ దైనా.. ప్రొఫెషనల్ లాంటి ఫొటోలు తీయొచ్చు.. ఈ 5 ట్రిక్స్ తెలిస్తే చాలు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×