E-Paper
Advertisement

మీ ఫోన్ కెమెరా నార్మల్ దైనా.. ప్రొఫెషనల్ లాంటి ఫొటోలు తీయొచ్చు.. ఈ 5 ట్రిక్స్ తెలిస్తే చాలు!

మీ ఫోన్ కెమెరా నార్మల్ దైనా.. ప్రొఫెషనల్ లాంటి ఫొటోలు తీయొచ్చు.. ఈ 5 ట్రిక్స్ తెలిస్తే చాలు!
Advertisement

Mobile Photography Tips: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలున్న నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు చాలా పవర్‌ఫుల్‌గా మారాయి. దీంతో లేటెస్ట్ మోడల్ ఫోన్ అయినా, కాస్త పాత ఫోన్ ఉన్నా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే.. ప్రొఫెషనల్స్ లాంటి ఫొటోలు తీయవచ్చని మనలో చాలామందికి తెలియదు. దూరపు ప్రయాణాలు, ఫ్యామిలీ మూమెంట్స్ లేదా ఆఫీస్ వర్క్ కోసం ఫొటోలు తీసేటప్పుడు కాస్త తెలివిగా క్లిక్ చేస్తే వచ్చే మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫొటోగ్రఫీని మరో స్థాయికి తీసుకెళ్లే కొన్ని చిట్కాలు మీ కోసం..

లెన్స్‌ని క్లీన్ చేస్తుండాలి:

చాలామంది ఫొటోలు తీసేటప్పుడు అస్సలు పట్టించుకోని విషయం ఇది. ఫోన్‌ను జేబుల్లో, బ్యాగుల్లో వేయడం వల్ల కెమెరా గ్లాస్‌పై దుమ్ము, వేలిముద్రలు పడుతుంటాయి. దీనివల్ల ఫొటోలు మసకగా వస్తాయి. అందుకే ఫొటో తీసే ముందు ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్‌తో కెమెరా లెన్స్‌ను మెల్లగా తుడవాలి. ఆ తర్వాత ఫొటో తీస్తే క్లారిటీ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది.

గ్రిడ్ లైన్స్‌తో పర్ఫెక్ట్ ఫ్రేమింగ్:

Advertisement

ఫోన్ కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి Grid Lines ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇది స్క్రీన్‌ను సమానమైన బాక్సులుగా విభజిస్తుంది. అప్పుడు మీరు తీయాలనుకునే ముఖ్యమైన సబ్జెక్టును ఆ గ్రిడ్ లైన్స్ కలిసే చోట లేదా మధ్యలో ఉండేలా చూసుకుంటే ఫొటోలు చూడటానికి చాలా అందంగా, ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి.

Also Read: అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

బ్రైట్‌నెస్‌ను సెట్ చేయాలి:

Advertisement

కెమెరాను కేవలం వస్తువుల వైపు చూపిస్తూ ఫొటోలు క్లిక్ చేయకూడదు. మీకు స్క్రీన్‌పై ఏది ముఖ్యం అనిపిస్తుందో (మనుషులు, పెంపుడు జంతువులు లేదా ప్రకృతి దృశ్యాలు) దానిపై వేలితో ట్యాప్ చేయండి. అప్పుడు కెమెరా దానికి తగ్గట్టుగా ఫోకస్ అవుతుంది. అలాగే ట్యాప్ చేసినప్పుడు పక్కనే వచ్చే బ్రైట్‌నెస్‌ బార్‌ను పైకి, కిందికి జరుపుతూ లైటింగ్‌ను మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఎడిటింగ్ యాప్స్‌తో కొత్త లుక్:

ఫొటో తీయడం ఒకెత్తయితే.. దాన్ని కాస్త అందంగా మార్చడం మరో పని. స్నాప్‌సీడ్, లైట్‌రూమ్ లేదా గూగుల్ ఫొటోస్ లాంటి ఫ్రీ యాప్స్ వాడి ఫొటోల్లో బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, కలర్స్ కాస్త పెంచుకోవచ్చు. అయితే ఫిల్టర్లను అతిగా వాడకుండా.. ఫొటో సహజత్వం దెబ్బతినకుండా చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.

నైట్ మోడ్, హెచ్‌డిఆర్ వాడకం:

లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కెమెరాలో ఉండే హెచ్‌డిఆర్ (HDR), నైట్ మోడ్ ఫీచర్లను వాడాలి. ఇవి ఫొటోలోని చీకటి భాగాలను, వెలుతురును సరిచేసి డిటైల్స్ బాగా వచ్చేలా చేస్తాయి. అలాగే, ఫొటో తీసేటప్పుడు డిజిటల్ జూమ్ వాడకుండా, మీరే వస్తువుకు కాస్త దగ్గరగా వెళ్లి ఫొటో తీస్తే ఎంతో క్వాలిటీగా ఉంటుంది. మంచి ఫోటోలు రావడానికి ఖరీదైన ఫోన్ అవసరం లేదు.. కెమెరా ఫీచర్లను సరిగ్గా వాడుకునే అవగాహన ఉంటే చాలు.

Also Read: యూట్యూబ్ షార్ట్స్ vs ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎక్కువ డబ్బులు దేంట్లో వస్తాయంటే?

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×