E-Paper
Advertisement

హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?

హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?
Advertisement

హోండా భారత మార్కెట్లోకి క్రేజీ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కొత్త ZR-V హైబ్రిడ్, సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల సందర్భంగా హోండా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, మార్కెట్‌ లో ఈ మోడల్ అధికారిక లాంచ్ 2027 ఫస్ట్ క్వార్టర్ లో అంటే జనవరి నుంచి మార్చి మధ్య జరిగే అవకాశం ఉందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రాజస్థాన్ లో రోడ్ టెస్ట్

ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రస్తుతం రాజస్థాన్‌ లోని తపుకారా ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో రోడ్ టెస్టింగ్ జరుపుకుంటోంది. దేశంలో తయారయ్యే ఈ మోడల్‌ ను దేశీయ మార్కెట్‌ తో పాటు విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని హోండా భావిస్తోంది. జపాన్ సహా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ కారును విక్రయించనుంది.

డిజైన్ గురించి..

Advertisement

హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్‌ కు చాలా దగ్గరగా ఉండేలా ఈ ఎస్‌యూవీ రానుంది. బాక్సీ స్టైల్ బాడీ, పెద్ద గ్లాస్ ఏరియా, ఫ్లాట్ టెయిల్‌ గేట్ దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. రోడ్డుపై బలమైన ప్రెజెన్స్ ను చూపించేలా డిజైన్ చేయబడుతున్న ఈ కారు ఫ్యూచరిస్టిక్ లుక్ తో ఆకట్టుకోనుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, విశాలమైన క్యాబిన్, మెరుగైన సీటింగ్ సౌకర్యం, కుటుంబ ప్రయాణాలకు అనువైన స్థలం లాంటి అంశాలపై దృష్టి పెట్టింది. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ఎక్స్ పీరియెన్స్ లభించే అవకాశం ఉంది.

ఆకట్టుకునేలా ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హోండా నుంచి వచ్చిన అత్యంత ఆధునిక వాహనంగా నిలవనుంది. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అత్యాధునిక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఒకే ఛార్జ్ తో 450 కి.మీ ప్రయాణం

Advertisement

హోండా ఇంకా బ్యాటరీ ప్యాక్, మోటార్ సామర్థ్యం లాంటి టెక్నికల్ వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉందని సమాచారం. టాప్ వేరియంట్లలో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఈ కొత్త హోండా ఎస్‌యూవీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, మహీంద్రా BE 6, త్వరలో రానున్న టాటా సియెర్రా EV లాంటి మోడళ్లకు ఇది ప్రత్యర్థిగా నిలవనుంది.

Read Also: టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 వచ్చేసింది.. కొత్తగా ఏమేం మారాయంటే?

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×