E-Paper
Advertisement

Mosquito Bat Risks: మస్కిటో బ్యాట్‌ను టీవీ దగ్గర పెడుతున్నారా? అయితే, మీరు కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే?

Mosquito Bat Risks: మస్కిటో బ్యాట్‌ను టీవీ దగ్గర పెడుతున్నారా? అయితే, మీరు కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే?
Advertisement

Mosquito Bat Risks: వర్షాకాలంలోనే కాదు.. వేసవిలోనూ ఇంట్లో దోమలు విపరీతంగా వేధిస్తుంటాయి. దీంతో దోమలను తరమికొట్టడానికి చాలామంది చేసే మొదటి పనేంటంటే.. ఎలక్ట్రిక్ దోమల బ్యాట్ పట్టుకుని వాటిని వెంటాడటం. అయితే కిటికీలు, తలుపుల దగ్గర దోమలను కొడితే ఫర్వాలేదు కానీ, టీవీ లేదా ల్యాప్‌టాప్ దగ్గర మాత్రం ఈ బ్యాట్‌ను అస్సలు వాడకండి. ఇది వినడానికి వింతగా అనిపించినా.. టీవీ స్క్రీన్ మీద చిన్న స్పార్క్ పడినా లక్షల రూపాయలు పెట్టి కొన్న టీవీ సెకన్లలో పాడైపోతుంది. టీవీ స్క్రీన్ మీద మస్కిటో బ్యాట్ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి..

దోమల బ్యాట్ ఏం చేస్తుంది?

మనం వాడే దోమల బ్యాట్ చూడ్డానికి టెన్నిస్ రాకెట్‌లా ఉన్నా.. దాని బటన్ నొక్కినప్పుడు బ్యాటరీలోని తక్కువ వోల్టేజీని దాదాపు 1000 నుండి 3000 వోల్టుల వరకు పెంచుతుంది. దోమ ఆ వైర్లకు తగిలినప్పుడు వచ్చే ఆ చిటపట శబ్దం వెనుక భారీ విద్యుత్ శక్తి ఉంటుంది. ఆ సమయంలో వెలువడే విద్యుత్ తరంగాలు చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Advertisement

Also Read: సిగ్నల్ లేకున్నా కాల్స్.. పిక్సెల్ రేంజ్ లుక్.. రూ.10వేల లోపే టెక్నో సరికొత్త స్మార్ట్‌ఫోన్!

సెన్సిటివ్ స్క్రీన్లకు ముప్పే:

పాతకాలంలో టీవీలు చాలా బరువుగా, బలంగా ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న LED, LCD టీవీలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. వీటి లోపల ఉండే సర్క్యూట్లు, రిబ్బన్ కేబుల్స్, టి-కాన్ బోర్డులు చిన్న చిన్న విద్యుత్ హెచ్చుతగ్గులను కూడా తట్టుకోలేవు. టీవీ స్క్రీన్ మీద కూర్చున్న దోమను బ్యాట్‌తో కొట్టకపోయినా, కేవలం టీవీకి దగ్గరగా బ్యాట్ వాడితే వచ్చే ఆ విద్యుత్ అయస్కాంత ప్రభావం వల్ల స్క్రీన్ లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల స్క్రీన్ పైన అడ్డంగా లేదా నిలువుగా గీతలు రావడం, రంగులు మారిపోవడం లేదంటే.. మొత్తానికే డిస్‌ప్లే ఆగిపోవడం వంటివి జరుగుతాయి.

టీవీలో ఏర్పడే నష్టమేంటి?

Advertisement

ఇప్పటికే చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ.. టీవీ స్క్రీన్ పైన దోమను చంపబోయి వేల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. ఒక్కోసారి బ్యాట్ పొరపాటున స్క్రీన్‌కు తగిలితే డిస్‌ప్లే పగిలిపోతుంది. మరికొన్ని సార్లు స్క్రీన్ పైకి కనిపించకపోయినా, లోపల ఉండే బ్యాక్ లైట్లు కాలిపోతాయి. ఇలా జరిగితే టీవీ రిపేర్ చేయడం కంటే కొత్తది కొనడమే ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే.. ప్యానెల్ మార్చాలంటే.. టీవీ ధరలో దాదాపు 70 నుంచి 80 శాతం ఖర్చు అవుతుంది.

జాగ్రత్తపడే మార్గాలివే:

దోమలను నివారించడానికి మస్కిటో బ్యాట్స్ వాడటం అవసరమే. కానీ దాని వల్ల లక్షలు విలువ చేసే టీవీని రిస్క్‌లో పెట్టకూడదు. ఒకవేళ టీవీ దగ్గర దోమలు ఉన్నప్పుడు బ్యాట్‌కు బదులు మెత్తటి కాటన్ క్లాత్ లేదంటే న్యూస్ పేపర్‌తో వాటిని మెల్లగా తోలేయండి. దోమల కోసం ఎలక్ట్రిక్ రిపెల్లెంట్లు లేదంటే సహజ సిద్ధమైన స్ప్రేలు వాడటం మేలు. ఇంట్లో పిల్లలకు కూడా ఈ విషయం గురించి చెప్పి, టీవీ దగ్గర దోమల బ్యాట్ వాడకుండా చూడండి. టీవీని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దోమల బ్యాట్‌ను కనీసం రెండు మీటర్ల దూరంలో ఉంచడం అవసరం.

Also Read: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేయనున్న ‘బడ్జెట్ బీస్ట్’ ల్యాప్‌టాప్స్ ఇవే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×