E-Paper
Advertisement

Bigg Boss Thanuja: అంతా బిగ్ బాస్ మహిమ.. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన తనూజ!

Bigg Boss Thanuja: అంతా బిగ్ బాస్ మహిమ.. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన తనూజ!
Advertisement

Bigg Boss Thanuja: ఈమధ్య కాలంలో బుల్లితెర సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటించి.. అటు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని, మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్న సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తనూజ పుట్టస్వామి కూడా ఒకరు. ‘ముద్దమందారం’ సీరియల్ లో అమాయకపు పాత్రలో నటించి అందరిని తన వైపు తిప్పుకున్న ఈమె ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సెంటిమెంట్, రిలేషన్స్, సీక్రెట్ లవ్ ట్రాక్ , ఎమోషన్స్, కామెడీ ఇలా తనలోని అన్ని యాంగిల్స్ ను బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

సీరియల్స్ కి గుడ్ బై చెప్పిన తనూజ..

అమాయకురాలిగా సైలెంట్ గా హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చిన ఈమె.. ఏకంగా టైటిల్ గెలుచుకునేందుకు చివరి మెట్టు వరకు వెళ్లి రన్నర్ గా నిలిచింది. ట్రోఫీని అందుకోకపోయినా మంచి గుర్తింపు, పాపులారిటీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇమేజ్ ను గట్టిగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇకపై సీరియల్స్ లో నటించను అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

సినిమాలపైనే ధ్యాసంతా..

Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. “మునుమందు నేను సీరియల్స్ చేయను. ఇప్పటికే నేను నటించిన ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఒక ఓటీటీ సిరీస్ కి కూడా ఓకే చెప్పాను. అది గత నవంబర్లోనే మొదలయ్యింది. అయితే నేను బిగ్ బాస్ కి రావడం వల్లే అది ఆగిపోయింది. ఇక త్వరలోనే వెబ్ సిరీస్ ను ప్రారంభిస్తాము” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఈమె సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేసి బిగ్ స్క్రీన్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమాల్లోకి రాణించాలనే ప్లాన్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తనూజ నటించిన సినిమాలు..

ఇక తనూజ నటించిన సినిమా విషయానికి వస్తే.. గతంలో ‘ లీగల్లీ వీర్’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం 2 ఏళ్ల క్రితమే విడుదలయ్యింది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతోనే తిరిగి ఆమె సినిమాలపై ఫోకస్ చేయాలని చూస్తోంది. ఆ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. తనకు క్రేజ్ వస్తుందని మాస్టర్ ప్లాన్ వేసిందట తనూజ. మరి తనూజాకు సినిమా ఇండస్ట్రీ ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.

Advertisement

also read: Pushpa 3: పుష్ప 3 ర్యాంపేజ్.. స్టోరీ లైనప్ అదర్స్!

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×