Google Year-end sale: మరి కొద్దిరోజుల్లో ఈ ఏడాది(2025) ముగుస్తుండటంతో గూగుల్ భారతీయ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో Google Year-End Saleను ప్రారంభించి, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు అలాగే ఇతర గూగుల్ పరికరాలపై భారీ తగ్గింపులు ప్రకటించింది. ఈ సేల్‌లో Pixel 9, Pixel 10 సిరీస్ ఫోన్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదనంగా, బ్యాంక్ ఆఫర్‌లు, బండిల్ డీల్‌లు, ధర తగ్గింపులు ప్రకటించింది. ఇయర్ ఎండ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నవాళ్లకి ఇదే సరైన సమయం.
తాజాగా విడుదలైన Pixel 10 సిరీస్ ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా EMIలో ఫోన్ కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ఇది మోడల్‌ను బట్టి రూ.10,000 వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. గూగుల్ 24 నెలల నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా అందిస్తోంది. దీంతో మొత్తం ఫోన్ నగదును ముందే చెల్లించాల్సిన అవసరం లేకుండా, నెలవారీ వాయిదాల్లో సులభంగా ఫోన్ కొనుగోలు చేసే వీలుంది.
ఇక Pixel 9 సిరీస్ కూడా ఈ సేల్‌లో వినియోగదారులను ఆకర్షిస్తోంది . స్టాండర్డ్ Pixel 9 తన లాంచ్ ధరతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ప్రీమియం ఫోన్‌ను తక్కువ ఖర్చుతో కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. అలాగే, ఈ సిరీస్‌లోని హై-ఎండ్ మోడళ్లు, ఫోల్డబుల్ వేరియంట్‌లపై కూడా గణనీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫోన్లకే కాకుండా గూగుల్ పిక్సెల్ యాక్సెసరీలపై కూడా భారీగా ధరలు తగ్గించింది. దీనిలో భాగంగా పిక్సెల్ స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు ఇప్పుడు లాంచ్ ధర కంటే.. తక్కువకు లభిస్తున్నాయి. ఇప్పటికే పిక్సెల్ ఫోన్ వాడుతున్నవారు.. తమ గాడ్జెట్ సెటప్‌ను కంప్లీట్ చేసుకోవాలన్నా, లేదా నాణ్యమైన వేర్‌బుల్స్, ఆడియో డివైజ్‌లు తక్కువ ధరలో కొనాలన్నా ఇదే మంచి అవకాశం.
గూగుల్ గ్యాడ్జెట్లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు, EMI ఆప్షన్‌లు మొత్తం కలిపి Google Year-End Sale మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ క్రమంలో Pixel 10 సిరీస్‌ను ఎంచుకున్నా.. లేదా Pixel 9 సిరీస్‌ను కొనుగోలు చేసినా కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. అలాగే ఈ సేల్‌లో అన్ని బడ్జెట్‌లకు సరిపోయే ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి.. ఈ ఛాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.