E-Paper
Advertisement

Srisailam Temple: శ్రీశైలం టెంపుల్ వద్ద యువతి రీల్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. తీరా సీన్ కట్ చేస్తే…?

Srisailam Temple: శ్రీశైలం టెంపుల్ వద్ద యువతి రీల్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. తీరా సీన్ కట్ చేస్తే…?
Advertisement

Srisailam Temple: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చితో యువత విచక్షణ కోల్పోతోంది. రీల్స్ మోజులో పడి ఎక్కడున్నాం,  ఏం చేస్తున్నాం అనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఓ యువతి చేసిన పని భక్తుల మనోభావాలను గాయపరిచింది.

ఆలయ దర్శనార్థం వచ్చిన ఓ యువతి క్షేత్ర పరిధిలోని నంది సర్కిల్ వద్ద రీల్స్ చేసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ప్రైవేట్ సాంగ్స్‌కు చిందులు వేస్తూ వీడియోలు చిత్రీకరించింది. అనంతరం ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. నిత్యం శివనామస్మరణతో మారుమోగే పవిత్ర క్షేత్రంలో  సినిమా పాటలకు స్టెప్పులు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఈ వీడియోలపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. “తోటి వారికి ఇబ్బంది కలుగుతుందనే సోయ లేకుండా.. సమయం సందర్భం లేకుండా ప్రవర్తించడం సరికాదు” అని మండిపడుతున్నారు.
ఆలయ పరిసరాల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.క్షేత్ర పవిత్రతను కాపాడటంలో దేవస్థానం అధికారులు, భద్రతా సిబ్బంది విఫలమవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

గతంలో కూడా పలు పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. శ్రీశైలం దేవస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పుణ్యక్షేత్రాలకు వచ్చే వారు ఆచార వ్యవహారాలను గౌరవించాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

ALSO READ: Vikarabad district Murder: ప్రేమ పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. కట్నం కోసం కొట్టి చంపిన భర్త

?utm_source=ig_web_button_share_sheet

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×