Elon Musk Bikini Grok AI Images| సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విచిత్ర ఫొటో తాజాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోని స్వయంగా మస్క్ లైక్ చేయడంతో ఆ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటో ఒక ఎక్స్ యూజర్ షేర్ చేసింది. ఫొటోలో ఎలాన్ మస్క్ పోలికలతో ఉన్న ఓ యువకుడు ఒక బికినీ స్విమ్ సూట్ (మహిళలు స్విమ్మింగ్ చేసే సమయంలో ధరించే లోదుస్తులు) ధరించి స్టైల్ గా నిలబడి ఉన్నాడు. ఈ ఫొటో చూసి చాలా మంది హాస్యాస్పందగా స్పందిస్తున్నారు. దాని మెమేస్ లాగా షేర్ చేస్తున్నారు. అయితే ఇదంతా సరదాగా ప్రారంభం కాలేదు. దీని వెనుక ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోక్ ఏఐ చాట్ బాట్ పై వస్తున్న విమర్శ ఉంది.
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని xAI తయారు చేసిన గ్రోక్ AI చాట్‌బాట్ మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ AI చాట్‌బాట్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో డీప్‌గా ఇంటిగ్రేట్ అయింది. ఇప్పుడు గ్రోక్ AI.. మహిళల సెక్సువల్ ఇమేజెస్ జనరేట్ చేయడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. గత కొన్ని వారాలుగా X యూజర్లు గ్రోక్‌ను మహిళల ఫోటోలను ఎడిట్ చేయమని అడుగుతున్నారు. ఫోటోల్లో దుస్తులు మార్చమని, బికినీలో పెట్టమని కోరుతున్నారు.
గ్రోక్ ఏఐలో యూజర్లు చేసే అభ్యర్థనలకు స్పందిస్తూ ఆ చాట్ బాట్ ఎక్స్‌పోజింగ్, రివీలింగ్ దుస్తుల్లో AI జనరేటెడ్ ఇమేజెస్‌ను పబ్లిక్‌గా పోస్ట్ చేస్తోంది. ఇలాంటి ఇమేజెస్ పెద్ద సంఖ్యలో గ్రోక్ పబ్లిక్ మీడియా ఫీడ్‌లో వచ్చాయి. దీని విమర్శిస్తూ.. ఒక యూజర్.. గ్రోక్ యజమాని ఎలాన్ మస్క్ ని అర్ధనగ్నంగా చూపించాలని ఆయన బికినీ ధరించి ఉన్నట్లు ఇమేజ్ జెనెరేట్ చేసి షేర్ చేసింది.
X యూజర్ ఈవా మెక్‌మిలన్ పోస్ట్ చేసిన ఒక ఫన్నీ ఇంటరాక్షన్ వైరల్ అయింది. ఒక యూజర్ గ్రోక్‌ను “ఇది ఎలాన్ మస్క్‌గా మార్చు” అని అడిగాడు. గ్రోక్ హ్యూమరస్ ఇమేజ్ పోస్ట్ చేసింది. ఇమేజ్‌లో కండలు కలిగిన యువ ఎలాన్ మస్క్ ని బ్లాక్ కలర్ టూ-పీస్ బికినీ స్విమ్‌సూట్, స్నీకర్స్‌లో నిలబడి ఉన్నాడు. ఇది ఎడిటెడ్ ఇమేజ్. ఈ ఇమేజ్ పై ఎక్స్ లో మస్క్ స్పందించాడు. ఎలాన్ మస్క్ “పర్ఫెక్ట్” ఆ ట్వీట్ పై కామెంట్ చేశాడు.
ఎలాన్ మస్క్ ఆ పోస్ట్‌కు “పర్ఫెక్ట్” అని రిప్లై ఇచ్చి.. OK హ్యాండ్ ఎమోజీ కూడా జోడించాడు. ఈ ఇంటరాక్షన్ త్వరగా అటెన్షన్ పొందింది. చాలా లైక్స్, రీపోస్ట్‌లు వచ్చాయి. ఇది అబ్సర్డ్ హ్యూమర్, మీమ్ స్టైల్‌కు ఫేమస్ అయింది.
గ్రోక్ ఏఐలో యూజర్లు మహిళలను చిన్న దుస్తుల్లో రివీలింగ్ గా ఉన్నట్లు ఇమేజ్ చేయమని ఇన్ పుట్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గ్రోక్ అలాంటి ఇమేజెస్ జెనరేట్ చేస్తోంది. అయితే ఇది ప్రైవేట్ చాట్ లతో పాటు పబ్లిక్ గా మిగతా ఎక్స్ యూజర్లందరికీ కనిపిస్తున్నాయి. జెమినీ, చాట్‌జీపీటీలాంటి AI చాట్‌బాట్‌లలో ఇమేజ్ అవుట్‌పుట్ యూజర్‌కు మాత్రమే కనిపిస్తుంది. కానీ గ్రోక్ ఇమేజెస్ పబ్లిక్‌గా ఎక్స్ ప్లాట్‌ఫామ్ లో అందరికీ కనిపిస్తాయి. Xలో బ్రౌజ్ చేసేవారు సెక్సువల్ ఇమేజెస్ సులభంగా చూడవచ్చు. గతంలో గ్రోక్‌ను తక్కువ రెస్ట్రిక్షన్లతో డిజైన్ చేశానని ఎలాన్ మస్క్ చెప్పాడు. ఫ్రీ ఎక్స్‌ప్రెషన్, హ్యూమర్ కోసమని అన్నాడు. కానీ విమర్శకులు ఇది దుర్వినియోగమవుతోందని అంటున్నారు.
Also Read: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ
గ్రోక్ ఒక రీసెంట్ ఇంటరాక్షన్‌లో “యూజర్లు నా ఇమేజ్-ఎడిటింగ్ స్కిల్స్‌ను చీకీ రిక్వెస్ట్‌లతో టెస్ట్ చేస్తున్నారు” అని చెప్పింది. దుస్తులు మార్చడం, తీసేయడం వంటివి రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. కానీ “బౌండరీస్ ముఖ్యం” అని కూడా చెప్పింది. అయితే ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తున్న కంటెంట్‌తో గ్రోక్ హద్దులు దాటుతోందని కనిపిస్తోంది. ఇలాంటి వివాదం ఇదే మొదటిది కాదు. ఈ ఏడాది ఇమేజ్ జనరేషన్ ఫీచర్ లాంచ్ అయినప్పుడు ట్రైనింగ్ టీమ్ డిస్టర్బింగ్, ఎక్స్‌ప్లిసిట్ మెటీరియల్ చూడాల్సి వచ్చిందని రిపోర్ట్స్ వచ్చాయి. కంపానియన్ మోడ్‌పై కూడా ఆందోళనలు ఉన్నాయి. ఇది టెక్నాలజీ దుర్వినియోగానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సెక్సువల్ AI కంటెంట్ పెరగడం.. AI టెక్నాలజీ బాధ్యతారాహిత్యం, భద్రత లోపించడం వంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది. డిజిటల్ కన్సెంట్, ప్లాట్‌ఫాం అకౌంటబిలిటీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
— Elon Musk (@elonmusk) January 1, 2026