E-Paper
Advertisement

Haier 4-door Refrigerator: మీ వంటగదికి రాయల్ లుక్.. హయ్యర్ లూమియర్ 4 డోర్ ఫ్రిజ్ అదిరిపోయే ఫీచర్స్ ఇవే!

Haier 4-door Refrigerator: మీ వంటగదికి రాయల్ లుక్.. హయ్యర్ లూమియర్ 4 డోర్ ఫ్రిజ్ అదిరిపోయే ఫీచర్స్ ఇవే!
Advertisement

Haier 4-door Refrigerator: సాధారణంగా ఫ్రిజ్ అంటే.. కిచెన్‌లో ఓ మూలన ఉండే మెషీన్ లాగే చూస్తాం. కానీ, హయ్యర్ ఇండియా ఇప్పుడు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. కేవలం ఆహారాలను, కూరగాయలను, పండ్లను ఫ్రెష్‌గా ఉంచడమే కాకుండా.. మన ఇంటికి సరికొత్త లుక్ ఇచ్చేలా Lumiere పేరుతో సరికొత్త 4 డోర్ రిఫ్రిజిరేటర్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.83,990గా నిర్ణయించారు.

అదిరిపోయే కలర్ ఆప్షన్స్..

చాలా కాలంగా మనం కిచెన్‌లో సిల్వర్ లేదా గ్రే కలర్ ఫ్రిజ్‌లనే చూస్తున్నాం. కానీ లూమియర్ సిరీస్‌లో హయ్యర్ సరికొత్త పర్ల్ వైట్, మావ్ పింక్, రోసెట్ వైట్ వంటి సాఫ్ట్ కలర్స్‌‌ను పరిచయం చేసింది. దీంతో మన ఇష్టానికి తగ్గట్టు గ్లాసీ లేదా మ్యాట్ ఫినిషింగ్‌ను ఎంచుకోవచ్చు. ఇది మన వంటగదికి ప్రీమియం, మోడ్రన్ లుక్‌ను అందిస్తుంది.

Advertisement

Also Read: తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కావాలా? రూ.15,499కే 7000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో 90 ఉందిగా!

520 లీటర్ల కెపాసిటీ..

ఏకంగా 520 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ ఫ్రిజ్ పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ద్వారా అత్యంత ఆకర్షణీయమైన కన్వర్టిబుల్ జోన్ ఫీచర్‌ను మనకు పరిచయం చేసింది సంస్థ. అలాగే మన అవసరానికి తగ్గట్టుగా దీనిలో 85 శాతం భాగాన్ని నార్మల్ స్టోరేజ్‌గా మార్చుకోవచ్చు. కేవలం 15 శాతం మాత్రమే ఫ్రీజర్‌గా ఉంచుకునే వెసులుబాటు ఉంది. పండగలు లేదా ఫంక్షన్ల టైంలో ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఈ ఫ్రిజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

అత్యాధునిక ఫీచర్లు..

Advertisement

టెక్నాలజీ పరంగా చూసుకుంటే.. ఈ ఫ్రిజ్ చాలా పవర్‌ఫుల్. దీనిలో ఇన్వర్టర్ కంప్రెసర్, డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ ఉన్నాయి. ఇవి ఫ్రిజ్ మొత్తాన్ని చల్లగా ఉంచడమే కాకుండా.. ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చూస్తాయి. బయట ఉండే డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా డోర్ తీయకుండానే టెంపరేచర్ మార్చుకోవచ్చు. ఇక ఓపెన్ కిచెన్ ఉన్న ఇంటికి ఇబ్బంది లేకుండా తక్కువ శబ్దం వచ్చేలా ఈ ఫ్రిజ్‌ను డిజైన్ చేశారు.

ఎక్కడ కొనుగోలు చేయాలి?

ఈ కొత్త లూమియర్ రిఫ్రిజిరేటర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. హయ్యర్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లు, పెద్ద షోరూమ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. కేవలం ఫీచర్లు మాత్రమే కాదు.. స్టైల్ కూడా ముఖ్యం అనుకునే వారికి ఈ హయ్యర్ లూమియర్ మంచి ఎంపిక.

Also Read: యాపిల్ మ్యాక్ యూజర్ల కోసం ప్రత్యేక మానిటర్లు.. BenQ నుంచి రెండు కొత్త మోడల్స్!

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో గత నెల అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×