4K Nano Gloss monitors: మీ యాపిల్ మ్యాక్‌బుక్ స్క్రీన్ మీద కనిపించే ఆ రిచ్ కలర్స్, క్వాలిటీ.. వేరే ఏ మానిటర్ కనెక్ట్ చేసినా రావడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? పెద్ద స్క్రీన్ మీద వర్క్ చేసుకోవాలని ఉందా? అయితే మీ కోసమే BenQ భారత్‌లోకి రెండు క్రేజీ 4K మానిటర్లను తీసుకొచ్చింది. MA270UP, MA320UP పేరుతో విడుదలైన ఈ మానిటర్లను బెన్‌క్యూ వాళ్లు కేవలం మ్యాక్ యూజర్ల అవసరాలను మనసులో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది.
మ్యాక్ యూజర్లు ఎదుర్కొంటున్న పెద్ద తలనొప్పి ఏంటంటే.. ల్యాప్‌టాప్‌లో ఒకలా కనిపించే రంగులు, పక్కన ఉన్న మానిటర్‌లో మరోలా కనిపిస్తాయి. కానీ బెన్‌క్యూ ఈ కొత్త మ్యాక్ సిరీస్‌తో ఆ సమస్యకు చెక్ పెట్టింది. దీనిలో వాడిన Nano Gloss టెక్నాలజీ వల్ల కలర్స్ చాలా డీప్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. ముఖ్యంగా మీరు వీడియో ఎడిటింగ్ లేదా ఫొటోగ్రఫీ చేసేవారైతే.. ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 రోజులు వాడొచ్చు.. వివో Y31d షాకింగ్ ఫీచర్లు ఇవే!
ఇవి ప్రీమియం మానిటర్లు కాబట్టి.. 27 అంగుళాల మోడల్ రూ.46,998 ధర ఉండగా.. 32 అంగుళాల మోడల్ ధర రూ. 56,998గా కంపెనీ నిర్ణయించింది. ఈ మానిటర్లను బెన్‌క్యూ ఆన్‌లైన్ స్టోర్‌లో గానీ, అమెజాన్ ఇండియాలో గానీ ఏదైనా ఎలక్ట్రానిక్ షాపుల్లో గానీ కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు మానిటర్లు కూడా మంచి 4K క్వాలిటీతో వస్తాయి. 27 అంగుళాల మోడల్ 450 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంటే.. 32 అంగుళాల మానిటర్ ఏకంగా 600 నిట్స్ వరకు వెళ్తుంది. అంటే.. కిటికీ పక్కన కూర్చుని వర్క్ చేస్తున్నా, వెలుతురు ఎక్కువగా ఉన్నా స్క్రీన్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
మ్యాక్‌బుక్ వాడేవారికి వైర్ల గందరగోళం లేకుండా దీనిలో కేవలం ఒక్క USB-C కేబుల్‌తోనే పని అయిపోయేలా చేశారు. ఈ ఒక్క కేబుల్ తోనే డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.. అదే టైంలో మీ ల్యాప్‌టాప్‌కు 90W వేగంతో ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. ఎక్స్‌ట్రా ఛార్జర్‌తో పనిలేదన్నమాట. ఇవి కాకుండా మరో USB-C పోర్ట్, HDMI లాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఈ మానిటర్లలో iDevice Color Sync అనే ఒక స్మార్ట్ ఫీచర్ ఉంది. దీనికి ఏ మ్యాక్‌బుక్ కనెక్ట్ చేసినా ఇది వెంటనే గుర్తుపట్టేసి, ఆ ల్యాప్‌టాప్‌కి తగ్గట్టుగా కలర్స్ సెట్ చేసేస్తుంది. దీంతో ప్రతిసారీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక దీని స్టాండ్‌ను కూడా మనకు నచ్చినట్లు ఎత్తు పెంచుకోవచ్చు, పక్కకు తిప్పుకోవచ్చు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ ధరలు, ఫీచర్లు లీక్.. యాపిల్‌కు గట్టి పోటీ తప్పదా?