E-Paper
Advertisement

Realme Narzo 90 5G: తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కావాలా? రూ.15,499కే 7000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో 90 ఉందిగా!

Realme Narzo 90 5G: తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కావాలా? రూ.15,499కే 7000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో 90 ఉందిగా!
Advertisement

Realme Narzo 90 5G: సామాన్యులు సైతం కొనగలిగేలా తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు అందించడంలో ప్రముఖ టెక్ సంస్థ రియల్‌మీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన రియల్‌మీ నార్జో 90 5G మోడల్ టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రూ.15,000 ధరలో ప్రీమియం ఫీచర్లు ఆశించే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఇప్పుడీ ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బ్రాండ్ డేస్ సేల్‌లో ఆఫర్ల ద్వారా కేవలం రూ.15,499కే లభిస్తోంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

ఈ రియల్‌మీ నార్జో 90 ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతో ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండ్రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. దీనికి తోడు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో, ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా తక్కువ సమయంలోనే ఫుల్ అయిపోతుది. రోజంతా స్క్రోలింగ్ చేసేవారికి, లాంగ్ జర్నీలు చేసేవారికి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది.

Advertisement

Also Read: శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఒలింపిక్ ఎడిషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి!

అద్భుతమైన కెమెరా సెటప్:

ఈ ఫోన్‌లో 6.57 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక 4000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కెమెరా పరంగా చూసుకుంటే.. ఫోన్ వెనుక వైపు 50MP కెమెరాతో పాటు, ముందు వైపు కూడా 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతో వీడియో కాల్స్, సెల్ఫీలు చాలా క్వాలిటీగా వస్తాయి.

ఫోన్ నీటిలో పడినా ఏం కాదు:

Advertisement

సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో ఐపీ రేటింగ్స్ తక్కువగా ఉంటాయి. కానీ ఈ నార్జో 90 5Gలో మాత్రం ఐపీ66, ఐపీ68, ఐపీ69 వంటి అత్యున్నత ప్రొటెక్షన్ ప్రమాణాలు ఉన్నాయి. దీంతో భారీ వర్షంలో తడిసినా, పొరపాటున నీటిలో పడినా ఫోన్‌కు ఏమీకాదు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మాక్స్ చిప్‌సెట్‌తో గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసేవారికి మెరుగైన పనితీరును అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15తో వచ్చే ఈ ఫోన్, విక్టరీ గోల్డ్, కార్బన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

Also Read: యాపిల్ మ్యాక్ యూజర్ల కోసం ప్రత్యేక మానిటర్లు.. BenQ నుంచి రెండు కొత్త మోడల్స్!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×