E-Paper
Advertisement

Flight Mode: ‘ఫ్లైట్ మోడ్‌’తో ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే.. ఎంత డబ్బు వృథా చేశారో..!

Flight Mode: ‘ఫ్లైట్ మోడ్‌’తో ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే.. ఎంత డబ్బు వృథా చేశారో..!
Advertisement

Flight Mode: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ‘ఫ్లైట్ మోడ్’ (Flight Mode) లేదా ‘ఏరోప్లేన్ మోడ్’ గురించి తెలిసే ఉంటుంది. సాధారణంగా విమాన ప్రయాణం చేసేటప్పుడు సిగ్నల్స్ వల్ల ఇబ్బంది కలగకుండా దీనిని ఆన్ చేయమని చెబుతుంటారు. అయితే ఈ చిన్న ఫీచర్‌తో విమాన ప్రయాణాలతో సంబంధం లేకుండా రోజువారీ జీవితంలోనూ ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాటరీ లైఫ్ పెరుగుదల

ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉండి.. ఎక్కువ సేపు ఫోన్ ఆన్‌లో ఉండాలనుకున్నప్పుడు ఫ్లైట్ మోడ్ బెస్ట్ ఆప్షన్. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో సిగ్నల్స్ కోసం వెతికే ప్రక్రియను ఆపేస్తుంది. దీనివల్ల బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గి.. ఛార్జింగ్ చాలా సేపు వస్తుంది.

సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్

Advertisement

ఎక్కడికైనా అర్జంట్‌గా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి ఫోన్ లో ఛార్జింగ్ తక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జింగ్‌ చేయడం బెస్ట్. నెట్‌వర్క్, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్షన్లు అన్నీ కట్ అవ్వడం వల్ల ఫోన్ సాధారణ సమయం కంటే చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

ప్రశాంతమైన నిద్ర

రాత్రి పూట నిద్రపోయేటప్పుడు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల నోటిఫికేషన్ల సౌండ్స్ వల్ల నిద్ర చెడిపోతుంటుంది. అలాగని ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తే అలారం మోగదు. అందుకే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెడితే ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు. ఉదయం కరెక్ట్ టైమ్‌కి అలారం కూడా మోగుతుంది.

పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు సేఫ్

Advertisement

పిల్లలు ఫోన్ చూస్తూ పొరపాటున ఎవరికైనా కాల్స్ చేయడం లేదా యూట్యూబ్‌లో ఏవేవో యాడ్స్ క్లిక్ చేయడం చేస్తుంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి గేమ్స్ లేదా డౌన్‌లోడ్ చేసిన వీడియోలు ఇస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల డేటా ఖర్చయ్యే ఛాన్స్ కూడా ఉండదు.

Also Read: ట్యూషన్ లేకుండానే మీ పిల్లాడు క్లాస్ టాపర్ కాగలడు.. తల్లిదండ్రులు ఈ సూపర్ టిప్స్ పాటిస్తే చాలు

సిగ్నల్ సమస్యలకు చెక్

కొన్నిసార్లు ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా అందక నెట్ స్లో అవ్వడం, కాల్స్ కట్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి కొన్ని సెకన్ల తర్వాత ఆఫ్ చేస్తే నెట్‌వర్క్ రీఫ్రెష్ అయ్యి సిగ్నల్స్ మళ్లీ అద్భుతంగా వస్తాయి. అంతేకాదు ఫ్లైట్ మోడ్‌లో ఉన్నప్పుడు వైఫై (Wi-Fi), బ్లూటూత్‌లను విడిగా ఆన్ చేసుకుని వాడుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

Also Read: సిలిండర్ ఖర్చుకు బ్రేక్ వేయండి.. ఈ ఇండక్షన్ స్టవ్స్‌తో సేవింగ్స్ మొదలెట్టండి

Related News

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

Big Stories

Advertisement
×