E-Paper
Advertisement

సిలిండర్ ఖర్చుకు బ్రేక్ వేయండి.. ఈ ఇండక్షన్ స్టవ్స్‌తో సేవింగ్స్ మొదలెట్టండి

సిలిండర్ ఖర్చుకు బ్రేక్ వేయండి.. ఈ ఇండక్షన్ స్టవ్స్‌తో సేవింగ్స్ మొదలెట్టండి
Advertisement

Best Induction Stoves 2026 India: గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ,మిడిల్ క్లాస్ ఇల్లాలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. వంటింట్లో గ్యాస్ సిలిండర్ వాడకం భారంగా మారుతుండటంతో ‘ఇండక్షన్ స్టవ్’ ఒక స్మార్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. కేవలం తక్కువ ఖర్చుతోనే కాకుండా.. చాలా వేగంగా, సురక్షితంగా వంట పూర్తి చేసే ఈ మోడ్రన్ స్టవ్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 ఇండక్షన్ స్టవ్స్ వివరాలు, వాటి ప్రత్యేకతలు మీ కోసం.

టాప్ 5 ఇండక్షన్ స్టవ్స్.. వీటితో వంట ఈజీ:

Advertisement

1. ఫిలిప్స్ వివా కలెక్షన్ (Philips Viva Collection HD4928/01):
ఇండియన్ మార్కెట్లో అత్యంత నమ్మకమైన బ్రాండ్ ఫిలిప్స్. ఇందులో 2100W పవర్ ఉండటం వల్ల వంట చాలా వేగంగా అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో ఇండియన్ వంటకాల కోసం ప్రత్యేకంగా మెనూ బటన్స్ ఉంటాయి. ఇది కరెంట్ ఆదా చేయడంలోనూ ముందుంటుంది. అంతే కాకుండా దీనిని క్లీన్ చేయడం కూడా సింపుల్.

2. ప్రెస్టీజ్ పిక్ 6.1 V3 (Prestige PIC 6.1 V3):
ప్రెస్టీజ్ కంపెనీ వారు మన తెలుగు ఇళ్లకు తగ్గట్టుగా దీనిని డిజైన్ చేశారు. ఇందులో ‘ఆటోమేటిక్ విజిల్ కౌంటర్’ అనే అదిరిపోయే ఫీచర్ ఉంది. అంటే మీరు కుక్కర్ పెడితే.. ఎన్ని విజిళ్లు వచ్చాయో ఇది లెక్కపెట్టి ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ప్రెషర్ కుక్కర్ వాడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Advertisement

3. పిజియన్ క్రూయిస్ (Pigeon by Stovekraft Cruise):
తక్కువ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి పిజియన్ క్రూయిస్ సరైంది. 1800W పవర్‌తో వచ్చే ఈ స్టవ్ బ్యాచిలర్స్ లేదా చిన్న కుటుంబాలకు సరిపోతుంది.ఇది చాలా కాంపాక్ట్‌గా ఉండటంతో పాటు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ.

Also Read: ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు

4. బజాజ్ మెజెస్టిక్ (Bajaj Majesty ICX 7):
బజాజ్ వారి ఈ మోడల్ చాలా కాలం పాడవకుండా ఉంటుంది. అంతే కాకుండా  ఇందులో.. ఉండే 8 రకాల ప్రీసెట్ మెనూలు వంటను ఈజీ చేస్తాయి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇది సేఫ్‌గా పని చేస్తుంది. దీని డిజైన్ కిచెన్‌కి ఒక స్టైలిష్ లుక్ ఇస్తుంది.

5. ఉషా కుక్ జాయ్ (Usha CookJoy 2000W):
సెన్సార్ టచ్ బటన్స్‌తో వచ్చే ఈ ఉషా ఇండక్షన్ స్టవ్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో.. ఉండే లాంగ్ టైమర్ ఫంక్షన్ వల్ల వంట మీద ఒక కన్నేసి ఉంచాల్సిన పని లేదు. కరెంట్ తక్కువ వాడుకుంటూనే వేడిని సమానంగా అందిస్తుంది.

పెరుగుతున్న LPG ధరల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఇండక్షన్ స్టవ్ వాడకం ఒక తెలివైన పని. ఇవి మీ కరెంట్ బిల్లును పెద్దగా పెంచవు. పైగా వంట గదిని చల్లగా ఉంచుతాయి. మీఅవసరాలకు తగ్గట్టుగా పై వాటిలో ఒక దానిని ఎంచుకుని మీ వంటను స్మార్ట్‌గా మార్చుకోండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×