E-Paper
Advertisement

ఎక్స్‌పైరీ లేని ఆహార పదార్థాలు.. సంవత్సరాలు గడిచినా అసలు చెడిపోవు

ఎక్స్‌పైరీ లేని ఆహార పదార్థాలు.. సంవత్సరాలు గడిచినా అసలు చెడిపోవు

మార్కెట్‌లో లభించే ప్యాకెట్ ఫుడ్స్‌కు ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ) ఉంటుంది. కానీ కొన్ని నేచురల్ ఫుడ్స్ (సహజ ఆహారాలు) సరైన భద్రతతో చాలా సంవత్సరాలు పాటు చెడిపోకుండా ఉంటాయి. ఇవి సహజ లక్షణాల వల్ల దీర్ఘకాలం ఉంటాయి. సరైన నిల్వ పద్ధతులు ఉంటే ఈ ఆహారాలు ఎమర్జెన్సీ సమయాల్లో చాలా ఉపయోగపడతాయి.

తేనె ఎప్పుడూ పాడవదు

ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం ఉండే సహజ ఆహారం తేనె. ఇందులో తేమ తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరగదు. పురాతన ఈజిప్టు సమాధుల్లో కూడా తినదగిన తేనె దొరికింది. కాలక్రమేణా తేనె.. స్ఫటికాలుగా మారవచ్చు అయితే అది సురక్షితమే. వేడి నీళ్లలో తేనె కలిగిన జార్ పెట్టి కదిపితే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

బియ్యం దశాబ్దాల పాటు పాడవకుండా ఉంటుంది

తెల్ల బియ్యంలో ఇతర ధాన్యాల కంటే నూనె తక్కువగా ఉండటం వల్ల ఇది చాలా ఎక్కువ కాలం బాగుంటుంది. గాలి రాని టైట్ డబ్బాల్లో, చల్లని ప్రదేశంలో భద్రపరిచి ఉంచాలి. బ్రౌన్ రైస్ కంటే తెల్ల బియ్యం ఎక్కువ కాలం ఉంటుంది.

ఎక్స్‌పైరీ డేట్ లేని ఉప్పు

ఉప్పు సహజంగా బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో ఉప్పు ఎప్పటికీ పాడవదు. తేమ వల్ల ముద్దలు అయినా ఉపయోగించవచ్చు. గాలి రాని టైట్ ప్యాక్ డబ్బాల్లో ఉంచాలి.

దీర్ఘకాలం నిల్వ ఉండే చక్కెర

పంచదారలో బ్యాక్టీరియా ఉండలేదు. తేమ తగలకుండా గాలి లేని డబ్బాల్లో ఉంచితే చాలా సంవత్సరాలు ఉంటుంది. బ్రౌన్ సుగర్ కంటే వైట్ సుగర్ ఎక్కువ కాలం ఉంటుంది.

డ్రై బీన్స్ చాలా కాలం ఉంటాయి

డ్రై బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గాలి లేని డబ్బాల్లో ఉంచితే దశాబ్దాలు ఉంటాయి. పాత బీన్స్ ఉడికించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

సోయా సాస్ దీర్ఘకాలం ఉంటుంది

సోయా సాస్‌లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఇది చాలా కాలం పాడవదు. మూసి ఉన్న బాటిల్‌లో పెడితే చాలా సంవత్సరాలు ఉంటుంది. తెరిచిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి.

వెనిగర్ సులభంగా పాడవదు

వెనిగర్‌లోని యాసిడ్స్ బ్యాక్టీరియాను అరికడుతుంది. రంగు కొంచెం మారినా వెనిగర్ సురక్షితమే. గాలి లేకుండా బాటిల్ మూసి ఉంచాలి.

కార్న్‌స్టార్చ్ చాలా కాలం ఉంటుంది

కార్న్‌స్టార్చ్‌ను పొడిగా, గాలి లేని డబ్బాల్లో ఉంచితే చాలా కాలం ఉంటుంది. తేమ తగలకుండా జాగ్రత్తపడాలి.

ప్యూర్ మేపుల్ సిరప్

ప్యూర్ మేపుల్ సిరప్ సహజంగా దీర్ఘకాలం ఉంటుంది. అయితే ఒక్కసారి తెరిచిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచాలి.

Also Read: ఏ వయసులో ప్రెగ్నెన్నీ ప్లాన్ చేయాలి? పెళ్లి తరువాత ఎన్నిరోజులు ఆగాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఇన్‌స్టంట్ కాఫీ కూడా ఎక్కువ కాలం ఉంటుంది

ఇన్‌స్టంట్ కాఫీని పొడిగా, గాలి లేని డబ్బాల్లో ఉంచితే చాలా కాలం రుచి కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

తేనె, ఉప్పు, షుగర్, బియ్యం, బీన్స్ వంటి ఆహారాలు సరైన నిల్వతో చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇవి వ్యర్థం తగ్గించి, ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగపడతాయి. సరైన భద్రతతో నిల్వ చేసుకోండి.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×