E-Paper
Advertisement

గూగుల్ వాడుతున్నారా? ఈ 5 సీక్రెట్ ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!

గూగుల్ వాడుతున్నారా? ఈ 5 సీక్రెట్ ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Hidden Google Search Features: మనకు ఏ చిన్న డౌట్ వచ్చినా.. “అబ్బా! గూగుల్ తల్లి ఉందిగా.. అడిగి తెలుసుకుందాం” అని వెంటనే స్మార్ట్‌ఫోన్ తీసి సెర్చ్ చేసేస్తాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గూగుల్ మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ.. మీరు గూగుల్‌ని కేవలం సమాచారం వెతకడానికే వాడుతున్నారా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు. గూగుల్ లోపల ఎవరికీ తెలియని కొన్ని క్రేజీ ఫీచర్లు, సీక్రెట్ టూల్స్ దాగున్నాయి. వాటి గురించి తెలిస్తే “ఇన్నాళ్లూ ఇది తెలియక నార్మల్ గా సెర్చ్ చేశామా” అని ముక్కున వేలేసుకుంటారు. మీ సెర్చ్ స్టైల్ ని మార్చేసే ఆ 5 ట్రెండీ సీక్రెట్ ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..

గూగుల్ లో దాగున్న ఆ 5 రహస్య ఫీచర్లు ఇవే..
1. ‘/’ (ఫార్వర్డ్ స్లాష్) మ్యాజిక్:
మీరు గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసి, రిజల్ట్స్ పేజీని కిందకి స్క్రోల్ చేస్తూ చదువుతున్నారు. అంతలోనే మరో కొత్త విషయం వెతకాలనిపిస్తే.. అప్పుడు మళ్లీ పైకి స్క్రోల్ చేసి సెర్చ్ బార్ పై క్లిక్ చేసే ఓపిక లేదా? అయితే మీ కీబోర్డ్ లో కేవలం / (Forward Slash) బటన్ నొక్కండి. అంతే.. మీరు పేజీలో ఏ మూలనున్నా సరే, కర్సర్ నేరుగా సెర్చ్ బార్ లోకి వెళ్లిపోతుంది. టైమ్ సేవ్ చేయడానికి ఇది బెస్ట్ ట్రిక్.

Advertisement

2. లాస్ట్ 15 మినిట్స్ హిస్టరీ మాయం:
ఫోన్ లో గూగుల్ యాప్ వాడుతున్నప్పుడు ఏదైనా పర్సనల్ గా సెర్చ్ చేశారా? ఆ హిస్టరీ ఎవరికీ కనిపించకూడదా? మొత్తం హిస్టరీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ యాప్ లో మీ ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేస్తే “Delete last 15 minutes” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే చాలు..గత 15 నిమిషాల్లో మీరు ఏం వెతికారనేది గూగుల్ మెమొరీ నుంచి ప్యాకప్ అయిపోతుంది.

3. ఇన్‌స్టాంట్ టైమర్ & స్టాప్‌వాచ్:
ఆఫీస్ వర్క్ లో డెడ్‌లైన్ పెట్టుకుని పని చేయాలా? లేదా ఇంట్లోనే 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలనుకుంటున్నారా? సెపరేట్ యాప్స్ ఎందుకు బాస్.. గూగుల్ సెర్చ్ బార్ లోకి వెళ్లి సింపుల్ గా “Timer” లేదా “Stopwatch” అని టైప్ చేయండి. సెర్చ్ రిజల్ట్స్ లోనే మీకు టైమర్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. మీకు నచ్చిన టైమ్ సెట్ చేసుకుని అక్కడే రన్ చేసుకోవచ్చు.

Advertisement

4. ఎక్స్‌క్లూడ్ వర్డ్స్ :
మీరు గూగుల్ లో ‘Apple’ గురించి వెతుకుతున్నారు. కానీ మీకు ‘యాపిల్ ఐఫోన్’ వద్దు.. కేవలం ‘యాపిల్ పండు’ గురించే కావాలి. అప్పుడు సెర్చ్ బార్ లో apple -iphone అని టైప్ చేయండి. అంటే మీరు వెతికే పదం పక్కన ‘మైనస్ (-)’ గుర్తు పెట్టి, మీకు వద్దనుకున్న పదాన్ని ఇస్తే.. గూగుల్ ఆ కంటెంట్ ని ఫిల్టర్ చేసి మీకు కావాల్సిందే కళ్లముందు ఉంచుతుంది.

Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు 100 ఏళ్లయినా పాడవ్వవు!

5. గూగుల్ లోనే క్లాసిక్ గేమ్స్:
బోర్ కొడుతోందా? టైంపాస్ కి ఫోన్ లో స్టోరేజ్ లేకపోయినా గూగుల్ లో గేమ్స్ ఆడేయొచ్చు. గూగుల్ సెర్చ్ లో “Pacman”, “Snake game” లేదా “Minesweeper” అని టైప్ చేయండి. ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే డైరెక్ట్ గా గూగుల్ పేజీలోనే ఈ క్లాసిక్ గేమ్స్ ఆడి ఎంజాయ్ చేయొచ్చు.

ట్విస్ట్ ఏంటంటే.. ఈ క్రేజీ అండ్ స్మార్ట్ ఫీచర్స్ అన్నింటినీ ఉపయోగించుకోవడానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గూగుల్ సెర్చ్ లోని ఈ హిడెన్ టూల్స్, ఫీచర్స్ అన్నీ 100% ఫ్రీ . కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. మీ స్మార్ట్‌ఫోన్ లేదా డెస్క్‌టాప్ లో వీటిని ఇప్పుడే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ ముందు స్మార్ట్ గా బిల్డప్ ఇచ్చేయొచ్చు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×