E-Paper
Advertisement

ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోందా? కొత్తది కొనకుండానే.. స్పీడ్ పెంచే మ్యాజిక్ చిట్కాలు ఇవే!

ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోందా? కొత్తది కొనకుండానే.. స్పీడ్ పెంచే మ్యాజిక్ చిట్కాలు ఇవే!
Advertisement

Fan Speed Tips: ప్రస్తుత వేసవిలో కాలంలో ఫ్యాన్ గాలి లేకుండా క్షణం కూడా ఉండే పరిస్థితి లేదు. అయితే కొన్ని సార్లు ఈ సీలింగ్ ఫ్యాన్లు.. చాలా నెమ్మదిగా తిరుగుతూ సహనానికి పరీక్షగా మారుతుంటాయి. అసలే ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఇంటి సభ్యులకు.. ఈ ఫ్యాన్ స్లో తిరగడం అనేది మరింత చికాకును కలిగిస్తుంటుంది. ఆ కోపంలో పాత దాని స్థానంలో కొత్తది ఫిక్స్ చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అయితే కొన్ని సులువైన చిట్కాలు పాటించడం ద్వారా పాత ఫ్యాన్ నే తిరిగి కొత్తదానిలా తిరిగేలా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్యాన్ రెక్కల క్లీనింగ్..

చాలా కాలం పాటు ఫ్యాన్ తుడవకపోతే రెక్కలపై మందపాటి దుమ్ము పేరుకుపోతుంది. ఈ అదనపు బరువు వల్ల ఫ్యాన్ వేగం కొన్నిసార్లు తగ్గే అవకాశముంది. కాబట్టి ముందుగా ఫ్యాన్ బ్లేడ్లను మెత్తని బట్టతో శుభ్రం చేస్తే మంచిందని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త కెపాసిటర్

Advertisement

ఫ్యాన్ స్లోగా తిరగడానికి 90% ప్రధాన కారణం పాడైపోయిన కెపాసిటర్ (Capacitor). దీని పనితీరు బలహీనపడితే ఫ్యాన్‌కు తగినంత పవర్ అందదు. తక్కువ ఖర్చుతో దొరికే కొత్త కెపాసిటర్‌ను టెక్నీషియన్ సాయంతో మార్చితే మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల గతంలో కంటే ఫ్యాన్ మరింత వేగంగా తిరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

రెగ్యులేటర్ చెకింగ్

కొన్నిసార్లు సమస్య ఫ్యాన్‌లో కాకుండా గోడకు ఉండే రెగ్యులేటర్‌లో ఉండవచ్చు. రెగ్యులేటర్ పాతదైనా లేదా లోపల వైరింగ్ లూజ్ అయినా ఫ్యాన్ స్పీడ్ తగ్గే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఒకసారి రెగ్యులేటర్ మారిస్తే.. ఫ్యాన్ వేగం పెరిగే ఛాన్స్ ఉంటుంది.

ఆయిల్ చుక్కలు

Advertisement

ఫ్యాన్ మోటార్‌లోని బేరింగ్స్ సజావుగా తిరగడానికి లూబ్రికేషన్ అవసరం. ఫ్యాన్ తిరిగేటప్పుడు కిర్రుమనే శబ్దం వస్తున్నా, స్లోగా తిరుగుతున్నా మోటార్‌ భాగాలలో కొన్ని ఆయిల్ చుక్కలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే గ్రీసింగ్ చేయడం ద్వారా కూడా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చని సలహా ఇస్తున్నారు.

Also Read: BSNL బంపరాఫర్.. ఫ్రీ సిమ్, కాల్స్, రోజూ 2GB డేటా.. మే 31 వరకే ఛాన్స్

బ్లేడ్ల వంపు సరిచేయడం

ఫ్యాన్ రెక్కలు ఎప్పుడూ కూడా ఒకే లెవెల్‌లో ఉండటం చాలా ముఖ్యం. ఏ ఒక్క రెక్క కొద్దిగా వంగినా గాలి నిరోధకత పెరిగి స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి అన్ని రెక్కలు సమానంగా ఉన్నాయో లేదో చూసి.. వంపు ఉన్న రెక్కను వెంటనే సరిచేయడం మంచిదని స్పష్టం చేస్తున్నారు. ఈ చిన్న మార్పులు చేసినా ఫ్యాన్ వేగం పెరగకపోతే.. అప్పుడు కొత్తది కొనడం లేదా మెకానిక్ ను పిలిచే ఆలోచన చేయాలని సూచిస్తున్నారు.

Also Read: AC Side Effects: అతిగా ఏసీలో ఉంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే.. ఏ క్షణమైనా..!

Related News

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

Big Stories

Advertisement
×