E-Paper
Advertisement

ఫోన్ వాల్యూమ్ బటన్ తో సీక్రెట్ ట్రిక్స్.. ఈ 4 విషయాలు తెలుసా?

ఫోన్ వాల్యూమ్ బటన్ తో సీక్రెట్ ట్రిక్స్.. ఈ 4 విషయాలు తెలుసా?
Advertisement

Phone Volume Button Tricks: స్మార్ట్‌ఫోన్ మనకు తెలియని అనేక ఫీచర్లు ఉంటాయి. వీటిల్లో వాల్యూమ్ బటన్ కూడా బటన్ కూడా ఒకటి. మనం జనరల్ గా వాల్యూమ్ బటన్ ను సౌండ్ పెంచుకోవడానికి, తగ్గించడానికి వాడతాం. అలాగే వాల్యూమ్ బటన్ తో మరికొన్నింటికి షార్ట్ కట్ గా వాడుకోవచ్చు. ఫోన్ ను ఫోర్స్ రీసెట్ చేయడానికి లేదా ఫోటోలు తీయడానికి వాల్యూమ్ బటన్‌లను ఉపయోగించవచ్చు. ఇటీవల ఐఫోన్‌లలో కెమెరా కంట్రోల్ ఫీచర్ కూడా వాల్యూమ్ బటన్ కు లింక్ చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కొన్ని యాప్ ద్వారా అదనపు ఫీచర్లను వాల్యూమ్ బటన్‌ ను యాడ్ చేయవచ్చు.

ఫొటోలు, వీడియోలు తీసేందుకు

ఫోన్ వాల్యూమ్ బటన్‌ ఉపయోగించి ఫోటోలు తీయవచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా లేదా ఐఫోన్ ఉన్నా కెమెరాను ఓపెన్ చేసిన తర్వాత ఫొటో తీయడానికి వాల్యూమ్ బటన్‌ను నొక్కవచ్చు. సింగిల్ హ్యాండ్ తో సెల్ఫీ లేదా ఫొటో తీయడానికి వాల్యూమ్ బటన్ ఈజీగా ఉంటుంది. కెమెరా ఓపెన్ చేసి వాల్యూమ్ బటన్‌ను కాస్త ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే వీడియో రికార్డింగ్ స్టార్ అవుతుంది. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి “ప్రెస్ వాల్యూమ్ బటన్స్ టు”పై క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫీచర్ ఎంచుకోవచ్చు.

ఫోర్స్ రీస్టార్ కోసం

Advertisement

మీ స్మార్ట్‌ఫోన్ స్టక్ అయిందనుకోండి.. దానిని ఫోర్స్ రీసెట్ చేసి మళ్లీ పనిచేసేలా చేయడానికి వాల్యూమ్ బటన్ ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా యాప్ బీటా వెర్షన్‌ను వాడుతుంటే సిస్టమ్ ఏదైనా ఇష్యూ వలన ఫోన్ స్టక్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఫోర్స్ క్లోజ్ కోసం వాల్యూ్మ్ బటన్ తో ఫోన్ రీసార్ట్ చేయవచ్చు. ఐఫోన్‌లో ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఫేస్ ఐడీ ఆఫ్ చేసేందుకు

ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ పనిచేయకుండా ఫోన్‌ను లాక్ చేయాల్సి వస్తే వాల్యూమ్ బటన్ యూజ్ అవుతుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఐఫోన్ పనిచేయకుండా చేసేందుకు వాల్యూమ్ అప్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మొదటిగా మీరు అత్యవసర కాల్‌ను ఆటోమేటిక్‌గా చేయవచ్చు. సైడ్ బటన్‌ను మళ్లీ ప్రెస్ చేయండి. ఈసారి ఫోన్ లాక్ స్క్రీన్‌ పూర్తిగా లాక్ అవుతుంది. ఫేస్ ఐడీ తిరిగి యాక్టివేట్ చేయడానికి పాస్‌కోడ్‌ ఎంటర్ చేయాలి.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు షాక్.. ఈసారి బ్లాక్ కలర్ లేనట్టే, iPhone 18 Proలో ఊహించని మార్పులు!

వాల్యూమ్ బటన్‌ తో మరిన్ని షార్ట్‌కట్‌లు

ఆండ్రాయిడ్ యాజర్స్.. వాల్యూమ్ బటన్ కు అదనపు ఫీచర్లను యాడ్ చేయవచ్చు. బటన్ మ్యాపర్ వంటి యాప్‌లతో వాల్యూమ్ బటన్‌లకు మరిన్నీ షార్ట్ కట్స్ యాడ్ చేయవచ్చు. ఉదాహరణకు స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ, వాల్యూమ్ బటన్‌ను రెండుసార్లు లేదా ఎక్కువసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే ఫ్లాష్‌లైట్‌ లేదా మీకు కావాల్సిన యాప్ లను ఓపెన్ చేయవచ్చు. లేదా స్క్రీన్ రికార్డింగ్‌ను ఆన్ చేయవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×