Hisense 55U7Q Mini LED TV: ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి ఫీల్ పొందాలనుకుంటున్నారా? అయితే హైసెన్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ U7Q 55-inch Mini LED TV మీకోసమే. సాధారణంగా మినీ ఎల్‌ఈడీ టీవీలు లక్షల్లో ఉంటాయి. కానీ హైసెన్స్ ఈ ప్రీమియం టెక్నాలజీని కేవలం రూ. 49,999 కే అమెజాన్‌లో అందుబాటులోకి తెచ్చింది. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, గేమింగ్ ఫీచర్లు, రిచ్ సౌండ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ టీవీ గురించి.. ఇది మీకు ఎందుకు బెస్ట్ ఆప్షనో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం టెలివిజన్ రంగంలో మినీ LED టెక్నాలజీ ఒక సంచలనం. సాధారణ LED టీవీల కంటే ఇవి ఎక్కువ బ్రైట్‌నెస్ , డీప్ బ్లాక్ కలర్స్‌ను అందిస్తాయి. ఈ క్రమంలో Hisense U7Q (55U7Q) మోడల్ మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.
డిజైన్ ,డిస్‌ప్లే :
ఈ టీవీ 55 ఇంచుల అల్ట్రా HD 4K స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో వాడిన మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీ వల్ల వేల సంఖ్యలో చిన్న ఎల్‌ఈడీలు స్క్రీన్ వెనక ఉండి, కాంతిని ఖచ్చితంగా నియంత్రిస్తాయి.
Quantum Dot Color: ఇది ఒక బిలియన్ కంటే ఎక్కువ రంగులను స్పష్టంగా చూపిస్తుంది.
144Hz Native Refresh Rate: గేమింగ్ ఇష్టపడే వారికి ఇది వరం. చాలా టీవీలు 60Hz మాత్రమే ఇస్తుంటే.. ఇందులో 144Hz ఉండటం వల్ల యాక్షన్ సీన్లు చాలా స్మూత్‌గా ఉంటాయి.
Dolby Vision IQ & HDR10+: సినిమా చూస్తున్నప్పుడు ఆయా సీన్లకు అనుగుణంగా బ్రైట్‌నెస్ , కాంట్రాస్ట్‌ను ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.
గేమింగ్ :
మీరు PS5 లేదా Xbox వంటి గేమింగ్ కన్సోల్స్ వాడుతుంటే.. ఈ టీవీ మీకు పర్ఫెక్ట్. ఇందులో HDMI 2.1 పోర్ట్స్ ఉన్నాయి. దీనివల్ల లాగ్లేకుండా, హై-స్పీడ్ గేమింగ్ ఫీల్ పొందవచ్చు. గేమర్స్ కోసం ప్రత్యేకంగా ‘గేమ్ మోడ్ ప్రో’ కూడా ఉంది.
సౌండ్ క్వాలిటీ :
ఈ టీవీలో 2.1 ఛానల్ ఆడియో సిస్టమ్ ఉంది. దీని అవుట్‌పుట్ సుమారు 49వాట్ వరకు ఉంటుంది.డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండటం వల్ల సౌండ్ మీ చుట్టూ వినబడుతున్నట్లుగా ఉంటుంది. మీరు విడిగా సౌండ్ బార్ కొనాల్సిన అవసరం ఉండదు.
Also Read: ఏసీ కొనేముందు ఈ పొరపాటు చేయకండి! మీ కరెంట్ బిల్లును సగం చేసే స్మార్ట్ టిప్స్
స్మార్ట్ ఫీచర్లు :
ఇది హైసెన్స్ సొంత VIDAA Smart OS పై పనిచేస్తుంది. ఇది చాలా వేగంగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి అన్ని యాప్స్‌ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కంట్రోల్ ఫీచర్ ద్వారా కేవలం మాటతోనే టీవీని కంట్రోల్ చేయవచ్చు.
ధర :
ప్రస్తుతం అమెజాన్ లో ఈ టీవీ ధర కేవలం రూ. 49,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉపయోగిస్తే ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. సుమారు రూ. 1,00,000 విలువ చేసే ఫీచర్లను సగం ధరకే రావడం నిజంగా గ్రేట్ డీల్.
తక్కువ ధరలో బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, అదిరిపోయే సౌండ్, ఫ్యూచర్-రెడీ గేమింగ్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. పాతకాలపు LED టీవీల నుంచి నెక్స్ట్ లెవల్ టెక్నాలజీకి మారాలనుకుంటే ఇప్పుడే అమెజాన్‌లో దీన్ని బుక్ చేసుకోండి.