E-Paper
Advertisement

Redmi Note 17 Pro Max.. 200MP కెమెరా, 10,000mAh బ్యాటరీ, ఈ రేంజ్ ఫీచర్లను ఎప్పుడైనా చూశారా?

Redmi Note 17 Pro Max.. 200MP కెమెరా, 10,000mAh బ్యాటరీ, ఈ రేంజ్ ఫీచర్లను ఎప్పుడైనా చూశారా?
Advertisement

Redmi New Smartphones: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఉండే అతిపెద్ద సమస్య.. బ్యాటరీ ఛార్జింగ్. ఫోన్ కొన్న కొత్తలో బాగానే ఉన్నా.. కొన్నాళ్లకు రోజుకు రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రెడ్‌మీ అడుగులు వేస్తోంది. ప్రముఖ టెక్ నిపుణుల సమాచారం ప్రకారం.. రెడ్‌మీ ఏకంగా 10,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్న మూడు కొత్త ఫోన్లను టెస్ట్ చేస్తోంది. గతంలో హానర్, రియల్‌మీ వంటి కంపెనీలు ఇలాంటి ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు రెడ్‌మీ రంగంలోకి దిగడంతో మొబైల్ మార్కెట్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

Note 17 సిరీస్‌లో పెను మార్పులు:

రెడ్‌మీలో మనందరికీ బాగా తెలిసిన నోట్ సిరీస్‌లోనే ఈ భారీ బ్యాటరీ ఫోన్లు రాబోతున్నాయి. ముఖ్యంగా Redmi Note 17 Pro Max మోడల్‌లో ఈ భారీ బ్యాటరీని చూడవచ్చు. సాధారణంగా 5,000mAh బ్యాటరీ ఉంటేనే అబ్బా ఎంత పెద్ద బ్యాటరీనా అనుకుంటాం. కానీ దానికి డబుల్ పవర్‌తో వస్తున్న ఈ ఫోన్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపడం ఖాయం. వివో, ఐకూ వంటి బ్రాండ్లు కూడా ఇదే బాటలో ఉన్నా.. రెడ్‌మీ మాత్రం అందరికంటే వేగంగా దూసుకుపోతోంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లా? 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో రెడ్‌మీ సరికొత్త రికార్డ్!

100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌:

చైనాలో 10,000mAh బ్యాటరీతో వస్తున్నా.. భారత్‌ లేదంటే ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు వచ్చే సరికి భద్రతా నియమాల దృష్ట్యా బ్యాటరీ సైజు కొంచెం తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ వెర్షన్‌లో 9,210mAh బ్యాటరీని ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అంత పెద్ద బ్యాటరీ అంటే ఛార్జింగ్ కావడానికి రోజంతా పడుతుందని భయపడక్కర్లేదు. ఎందుకంటే దీనికోసం 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇస్తున్నారు. దీంతో కొన్ని నిమిషాల్లోనే ఛార్జింగ్ ఎక్కిపోయి, ఫోన్ మళ్లీ వాడకానికి రెడీ అయిపోతుంది.

కెమెరా, డిస్‌ప్లే అదిరిపోనున్నాయి:

Advertisement

కేవలం బ్యాటరీని మాత్రమే నమ్ముకోకుండా.. ఫోన్ ఫీచర్ల విషయంలో కూడా రెడ్‌మీ గట్టిగానే ప్లాన్ చేసింది. ఇందులో 200MP శాంసంగ్ మెయిన్ కెమెరా ఉండబోతోంది. దీంతో ఫొటోలు క్లారిటీగా రావడమే కాకుండా.. సెల్ఫీల కోసం 32MP కెమెరాను కూడా ఇస్తున్నారు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. 1.5K రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేతో వీడియోలు చూస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు అదిరిపోయే ఫీల్ వస్తుంది.

లుక్ కూడా చాలా క్లాసీగా..

ఈ ఫోన్లు కేవలం బ్యాటరీ వల్ల లావుగా ఉండకుండా.. చాలా స్టైలిష్‌గా ఉండేలా మెటల్ ఫ్రేమ్‌తో డిజైన్ చేస్తున్నారు. ఫోన్ లోపల ఉండే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో సెక్యూరిటీ కూడా పక్కాగా ఉంటుంది. ప్రస్తుతం ఇవి టెస్టింగ్ దశలో ఉన్నాయి కాబట్టి.. త్వరలోనే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ప్రయాణాల్లో పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి అయ్యేది. కానీ ఇలాంటి ఫోన్లు వస్తే ఇక పవర్ బ్యాంక్‌లకు గుడ్ బై చెప్పేయొచ్చు.

Also Read: ఏంది మామా ఈ అరాచకం.. 8,000mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లే‌తో iQOO కొత్త ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తుట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

Big Stories

Advertisement
×