E-Paper
Advertisement

ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.. లేకపోతే జీవితం నాశనమే

ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.. లేకపోతే జీవితం నాశనమే
Advertisement

Online Dating| ఈ రోజుల్లో ఆన్‌లైన్ డేటింగ్ విధానం బాగా పాపులర్ అవుతోంది. చాలామంది డేటింగ్ యాప్స్ ద్వారా కొత్త కొత్త పార్టనర్స్ కోసం వెతుకుతున్నారు. ఇదంతా చూసి లైఫ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉందని అనిపిస్తుంది. అంతా చాలా ఈజీగా జరుగుతోందని అనిపిస్తుంది. కానీ ఇలా ప్రేమ కోసం ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ మీద ఆధారపడడం ప్రమాదకరం కావొచ్చు. ఎందుకంటే అపరిచితులతో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

ముందుగా ప్రమాదాలను అర్థం చేసుకోండి

ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరు. కొందరు వ్యక్తులు మోసం చేయడానికి డేటింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. వారు తమ నిజమైన గుర్తింపును దాచిపెడతారు. మోసగాళ్ళు మిమ్మల్ని బాగా నమ్మించి కొంత సమయం తరువాత డబ్బు లేదా వ్యక్తిగత వివరాలు అడుగుతారు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

వ్యక్తిగత సమాచారాన్ని తొందరగా షేర్ చేయొద్దు

Advertisement

మీ ఇంటి చిరునామా, పనిచేసే స్థలం లేదా ఫోన్ నంబర్ ను ఎవరికైనా తొందరగా చెప్పకండి. ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడానికి ముందు సమయం తీసుకోండి. ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకోవడం మానుకోండి

అపరిచితులకు మీ వ్యక్తిగత ఫోటోలను ఎప్పుడూ పంపకండి. వారు మీ ఫోటోలను అనుమతి లేకుండా దుర్వినియోగం చేయవచ్చు. ఒకసారి షేర్ చేసిన కంటెంట్ ను మీరు నియంత్రించలేరు. ఎప్పటికప్పుడు మీ గోప్యతను కాపాడుకోండి.

ప్రమాద సంకేతాలను గుర్తించండి

Advertisement

అసాధారణ లేదా అనుమానాస్పద ప్రవర్తనను ముందస్తుగా గమనించండి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అతిగా మెచ్చుకోవడం ఒక ప్రమాద సంకేతం కావచ్చు. తొందరగా మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసి వారు చెప్పింది చేయాలని కోరతారు. ఇది మోసానికి సంకేతం. డబ్బు అడగడం చాలా పెద్ద ప్రమాద సంకేతం. అప్పుడు వెంటనే మీరు అలర్ట్ అయిపోవాలి.

సురక్షితమైన ప్రదేశంలో మొదటి సమావేశం

కొంతకాలం డేటింగ్ చేసిన తరువాత ఏదైనా ప్రదేశంలో మీతో కలవాలని కోరుతారు. అలా మొదటిసారి కలిసేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బహిరంగ, రద్దీగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. ఒంటరిగా ఉండే ప్రదేశాలలో కలవకండి. ఒక స్నేహితునికి లేదా కుటుంబ సభ్యునికి మీరు ఎక్కడ కలుస్తున్నారో తెలియజేయండి. మీకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆ ప్రదేశం నుండి బయటికి వెళ్ళిపోండి.

Also Read: భారీతీయ మహిళల్లో చీర క్యాన్సర్ ముప్పు.. ఈ ఒక్క తప్పు వల్లే ఆరోగ్యానికి ప్రమాదం

రిలేషన్‌షిప్  నెమ్మదిగా నిర్మించాలి

ఆన్ లైన్ డేటింగ్, లవ్ విషయాలలో తొందరపాటు అవసరం లేదు. ఒక వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. ప్రశ్నలు అడుగుతూ, వారి సమాధానాలు ఒకేలా ఉన్నాయో లేదో గమనించండి. ఆ నమ్మకం నెమ్మదిగా, సహజంగా ఏర్పడాలి. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోండి.

ఆన్‌లైన్ డేటింగ్ సరైన జాగ్రత్తలతో చేస్తే సురక్షితంగా ఉంటుంది. మీరు నిర్లక్ష్యంగా ఉండే మీ జీవితం నాశనమయ్యే ప్రమాదముంది. చిన్న చిట్కాలు పాటించడం వలన పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి, స్పష్టంగా ఆలోచించండి, భావోద్వేగాల కంటే మీ భద్రత ఎల్లప్పుడూ ముఖ్యం.

Also Read: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? సహజంగా ఎత్తు పెరగడానికి ఈ ఆహారాలు తినిపించండి

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×