E-Paper
Advertisement

HMD Touch 4G: హెచ్ఎండి టచ్ 4జీ బ్యాక్ అగైన్.. ఆలస్యం చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోతారు బాసూ!

HMD Touch 4G: హెచ్ఎండి టచ్ 4జీ బ్యాక్ అగైన్.. ఆలస్యం చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోతారు బాసూ!
Advertisement

HMD Touch 4G: బడ్జెట్ ఫోన్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన HMD టచ్ 4G మళ్లీ స్టాక్‌లోకి వచ్చింది. ‘హైబ్రిడ్ ఫోన్’గా పేరు తెచ్చుకున్న ఈ డివైస్‌ను HMD గ్లోబల్ 2025 అక్టోబర్ 7న భారత్‌లో లాంచ్ చేసింది. మంచి డిమాండ్ కారణంగా అప్పట్లో స్టాక్ త్వరగా అయిపోయింది. ఇప్పుడీ ఫోన్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. సుమారు 100 గ్రాముల బరువుతో కాంపాక్ట్, తేలికైన డిజైన్ ఇందులో ప్రధాన ఆకర్షణ. ఇది సియాన్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. అలాగే IP52 రేటింగ్ ఉండటంతో దుమ్ము, తేలికపాటి నీటి చినుకుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

HMD టచ్ 4G బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.3,999. సియాన్, డార్క్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ హ్యాండ్ సెట్ అందుబాటులో ఉంటుంది. యూజర్లు ఈ ఫోన్‌ను HMD అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

సౌకర్యవంతంగా..

Advertisement

HMD టచ్ 4Gలో 3.2 అంగుళాల టచ్‌స్క్రీన్ QVGA డిస్‌ప్లే ఉంది. చిన్న సైజ్ ఫోన్ ఇష్టపడే వారికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. గ్రిడ్-బేస్డ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు, ఈ ఫోన్ RTOS ఆధారిత S30+ టచ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇకపోతే.. ఈ డివైస్ డ్యూయల్ సిమ్(నానో+నానో)తో పాటు మైక్రో SD కార్డ్ సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే 4G LTE, VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5.0 వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

ప్రత్యేకమైన ఫీచర్లు:

ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ ఎక్స్‌ప్రెస్ చాట్ యాప్. దీని ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ నోట్స్ పంపడమే కాకుండా, వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. ఈ యాప్ Android, iOS ఫోన్లతో కూడా పని చేస్తుంది. అదనంగా, క్లౌడ్ యాప్స్ ద్వారా క్రికెట్ స్కోర్‌లు, వార్తలు, వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక ఫొటోగ్రఫీ కోసం ఇందులో 2MP వెనుక కెమెరా (LED ఫ్లాష్‌తో), 0.3MP VGA ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇవి బేసిక్ ఫొటోలు, వీడియో కాలింగ్‌కు సరిపోతాయి.

Related News

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

రూ.908కే అదిరిపోయే సౌండ్..యూత్ ఫిదా అయ్యే ట్రెండింగ్ బ్లూటూత్ స్పీకర్!

iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

Big Stories

Advertisement
×