Maruti Suzuki Victoris: ICOTY 2026లో మారుతి సుజుకి విక్టోరిస్ సత్తా చాటింది. న్యూ జెనరేషన్ EVలు, SUVలు, ఫ్యామిలీ కార్లను వెనక్కి నెట్టి మరీ.. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2026గా ఎంపికైంది. కాంపాక్ట్ SUVలు, EVలు మొదలుకొని మెయిన్ స్ట్రీమ్ ఫ్యామిలీ సెడాన్‌ల వరకు లాంచ్ అయ్యాయి. విక్టోరిస్ మంచి కెపాసిటీ, టెక్నాలజీతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అన్ని అంశాల్లో సత్తాచాటి ఈ ప్రతష్టాత్మక అవార్డును దక్కించుకుంది
ICOTY 2026లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్స్ క్లావిస్ EV, కియా సైరోస్, మహీంద్రా XEV 9E, మారుతి సుజుకి విక్టోరిస్, స్కోడా కైలాక్, టాటా హారియర్ EV లాంటి కార్లతో పోటీ పడింది. ICOTY జ్యూరీ అన్నీ అంశాలను పరిశీలించి ఈ ఈ కార్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఆటోమోటివ్ జర్నలిస్టులు, టెక్ నిపుణులు జ్యూరీ మెంబర్స్ గా వ్యవహరించారు. అన్ని అంశాలకు ఇచ్చిన పాయింట్స్ ఆధారంగా మారుతి సుజుకి విక్టోరిస్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్- 2026గా అవార్డు దక్కించుకుంది.
మారుతి సుజుకి విక్టోరిస్ అరీనా ఛానల్ ఫ్లాగ్ షిప్ మిడ్ సైజ్ SUV గా మార్కెట్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 3, 2025న లాంచ్ అయింది. Got It All ట్యాగ్ లై న్‌తో వచ్చిన ఈ SUV, మారుతి గ్రాండ్ విటారా సిస్టర్ మోడల్ గా పరిచయం అయ్యింది. యువతను ఆకట్టుకునేలా బోల్డ్ డిజైన్, ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది. బేస్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 19-20 లక్షల వరకు ఉంటుంది.
1.5L మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 102 hp సామర్థ్యం, 139 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ టయోటా టెక్ తో బెటర్ మైలేజ్ సుమారు 25+ kmpl వస్తుంది. CNG వేరియంట్ అండర్ బాడీ ట్యాంక్ తో వస్తుంది. AWD టాప్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. మైలేజ్ 20-21 kmpl (పెట్రోల్), హైబ్రిడ్ లో ఎక్కువగా వస్తుంది.
10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ + 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, Infinity 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్ తో వస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్ ను కలిగి ఉంటుంది. లెవెల్ 2 ADAS, 360° కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలెక్సా వాయిస్ అసిస్టెంట్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉంటాయి. భారత్ NCAP, గ్లోబల్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారు Hyundai Creta, Kia Seltos, Tata Curvv, Honda Elevate, Volkswagen Taigun, Skoda Kushaq, సిస్టర్ మోడల్ Grand Vitaraతో పోటీ పడుతుంది.
Read Also: ICOTY 2026లో సత్తా చాటిన మహీంద్రా XEV 9e, ఆ కేటగిరీలో అవార్డు కైవసం!