E-Paper
Advertisement

Honeycomb vs Wood Wool: ఏసీ లాంటి చల్లదనం కావాలా? అయితే ఈ రెండు కూలర్లలో.. ఏది బెస్ట్ అంటే?

Honeycomb vs Wood Wool: ఏసీ లాంటి చల్లదనం కావాలా? అయితే ఈ రెండు కూలర్లలో.. ఏది బెస్ట్ అంటే?
Advertisement

Honeycomb vs Wood Wool: వేసవిలో ఏసీలు, కూలర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏసీలను కొనే స్థోమత లేని వారు.. కాస్త తక్కువలో వచ్చే కూలర్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే కూలర్ కొనేముందు చాలా మందిని ఓ కన్యూజన్ వెంటాడుతుంది. మార్కెట్లో ప్రధానంగా లభించే హానీ కోంబ్ ప్యాడ్లు (Honeycomb), గడ్డి ప్యాడ్లు (Wood-wool) ఉన్న కూలర్లలో ఏది ఎక్కువ కూలింగ్ ఇస్తుందా? అని తెగ ఆలోచిస్తుంటారు. ఈ కథనంలో దానిపై క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

వుడ్ వూల్ ప్యాడ్లు (గడ్డి ప్యాడ్లు)

సాంప్రదాయకంగా కూలర్లలో వాడే ఎండు గడ్డి లాంటి ప్యాడ్లనే వుడ్ వూల్ ప్యాడ్లు అంటారు. ఇవి నీటిని త్వరగా పీల్చుకుంటాయి కాబట్టి ప్రారంభంలో చాలా ఎక్కువగా చల్లటి గాలిని ఇస్తాయి. వీటి ధర కూడా చాలా తక్కువే కావడంతో సామాన్యులకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అయితే నిర్వహణ పరంగా వీటి వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల వాడకం తర్వాత ఈ వుడ్ వూల్ ప్యాడ్లు పాడైపోతాయని అంటున్నారు. ఫలితంగా వాటిని కొద్ది కాలానికే మార్చాల్సి రావొచ్చని పేర్కొంటున్నారు. ప్రారంభంలో బాగా పనిచేసినా కొద్దికాలానికే జీవం కోల్పోయి.. కూలింగ్ ఇచ్చే సామర్థ్యాన్ని సైతం కోల్పోతాయని స్పష్టం చేస్తున్నారు.

హనీకోంబ్ ప్యాడ్లు

Advertisement

ఈ హనీకోంబ్ ప్యాడ్లు.. చూడటానికి తేనటీగ తుట్టె ఆకృతిలో ఉంటాయి. వీటిని సెల్లోజ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. కూలింగ్ పరంగా ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. గడ్డి ప్యాడ్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం పాటు చెక్కుచెదరకుండా కూలింగ్ ను అందిస్తాయి. ఇవి గాలికి నీటిని బాగా తగిలేలా చేసి.. గది అంతటిని చల్లగా మార్చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత 3-5 ఏళ్ల పాటు హానీకోంబ్ ప్యాడ్లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వీటిని నిర్వహణ కూడా చాలా తేలికే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా దుమ్ము పడినా.. నీటితో కడిగితే పోతుందని తెలియజేస్తున్నారు. అయితే గడ్డి ప్యాడ్లతో పోలిస్తే హనీకోంబ్ ప్యాడ్లు ఉన్న కూలర్ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్!

ఫైనల్గా ఏది కొంటే బెటర్..?

Advertisement

అత్యాధునిక టెక్నాలజీ, ఎక్కువ కాలం మన్నికగా ఉండే కూలర్ ను కోరుకుంటే.. హానీకోంబ్ ప్యాడ్లు ఉన్నది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి సైతం ఇదే ఉత్తమ ఎంపిక. ఒకవేళ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి.. ఎక్కువ చల్లదనం అవసరం లేదని భావిస్తే.. వుడ్ వూల్ ప్యాడ్ల వైపు మెుగ్గు చూపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫైనల్గా కాస్త రేటు ఎక్కువైనా హనీకోంబ్ ప్యాడ్లే కొంటేనే మంచిదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

Also Read: ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×