E-Paper
Advertisement

ఈ ఫోన్‌తో రీల్స్ చేస్తే వ్యూస్ రాకెట్‌లా దూసుకెళ్తాయ్.. 4K ఫ్లాష్ రికార్డింగ్‌తో Honor 600 సంచలనం!

ఈ ఫోన్‌తో రీల్స్ చేస్తే వ్యూస్ రాకెట్‌లా దూసుకెళ్తాయ్.. 4K ఫ్లాష్ రికార్డింగ్‌తో Honor 600 సంచలనం!
Advertisement

Honor 600 Series: హానర్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాటరీ లైఫ్, కెమెరా పర్ఫార్మెన్స్‌కు పెద్దపీట వేస్తూ తమ సరికొత్త Honor 600 సిరీస్‌ను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. మే 25వ తేదీన సాయంత్రం ఈ ఫోన్లు అధికారికంగా లాంచ్ కానున్నాయి. గతంలో లాగే ప్రముఖ నటుడు జియావో ఝాన్ ఈ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

ఈ సరికొత్త చైనీస్ వేరియంట్లలో ఏకంగా 8600mAh బ్యాటరీని అందిస్తుండటం విశేషం. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన మోడల్స్‌లోని 7000mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గత మోడల్ అయిన Honor 500 సిరీస్‌లో 8000mAh బ్యాటరీ ఉండేది. దానికంటే ఇది మరింత మెరుగ్గా ఉంటూ,, ఫోన్‌ను ఎక్కువగా వాడేవారికి రోజంతా తిరుగులేని బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

కెమెరా మాయాజాలం:

Advertisement

హానర్ ఈసారి ఇమేజింగ్ టెక్నాలజీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనిలో 200 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ మెయిన్ సెన్సార్‌ను ఇస్తున్నారు. దీని సహాయంతో తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన వీడియోలు, లైవ్ కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. అలాగే మిర్రర్‌లెస్ కెమెరా రేంజ్ క్వాలిటీతో 4K ఫ్లాష్ లైవ్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

Also Read: టెక్ లవర్స్ గెట్ రెడీ.. షావోమి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, లాంచ్ డేట్ ఫిక్స్!

సరికొత్త డిజైన్, కలర్:

Advertisement

లుక్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా ఆకర్షణీయంగా ఉండబోతోంది. కంపెనీ ఇందులో లక్కీ స్టార్ అనే సరికొత్త కలర్ వేరియంట్‌ను పరిచయం చేసింది. గ్లోబల్ మోడల్స్‌తో పోలిస్తే ఈ చైనా వేరియంట్ బ్యాక్ ప్యానెల్ గ్లోసీగా, లైటింగ్‌కు తగ్గట్టు రంగులు మారేలా చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

మిగతా వివరాలు త్వరలోనే..

ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్, డిస్‌ప్లే, ఛార్జింగ్ స్పీడ్, ధర వంటి పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. లాంచ్ తేదీ దగ్గరపడే కొద్దీ మిగిలిన స్పెసిఫికేషన్లు తెలిసే అవకాశం ఉంది. కాగా, గ్లోబల్ వేరియంట్ కోసం ఎదురుచూసే వారు గత నెలలోనే విడుదలైన అంతర్జాతీయ మోడల్స్‌ను పరిశీలించవచ్చు.

Also Read: టెక్ లవర్స్‌కు పూనకాలే.. Xiaomi 18 కంటే ముందే మార్కెట్లోకి Redmi K100, ఇక విధ్వంసమే!

 

 

 

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×