E-Paper
Advertisement

టెక్ లవర్స్ గెట్ రెడీ.. షావోమి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, లాంచ్ డేట్ ఫిక్స్!

టెక్ లవర్స్ గెట్ రెడీ.. షావోమి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Xiaomi 17T Series: టెక్ ప్రియుల్లో షావోమీ ఫోన్లకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కంపెనీ తమ సరికొత్త Xiaomi 17T సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోనే ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయని టెక్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన కొద్దిరోజులకే భారత్‌లోనూ ఇవి సందడి చేయనున్నాయి. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే?

తాజా లీక్స్ ప్రకారం.. ఈ సిరీస్ ఫోన్లు మే 28న గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టనున్నాయి. ఆ తర్వాత మన దేశంలో ముందుగా Redmi Turbo 5 మోడల్‌ను పరిచయం చేసి, ఆ వెంటనే ఈ Xiaomi 17T, Xiaomi 17T Pro ఫోన్లను లాంచ్ చేస్తారట. అంతేకాదు.. చైనాలో రాబోయే Xiaomi 17 MAx మోడల్‌ను కూడా భారత్‌కు తీసుకొచ్చే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

కొత్త ఫోన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది బడ్జెట్. ప్రస్తుతం లీకైన వివరాల ప్రకారం.. షావోమి 17T బేసిక్ మోడల్ (12GB+256GB) ధర దాదాపు రూ.83,000 ఉండొచ్చు. ఇక ఫీచర్లు ఎక్కువగా ఉండే టాప్ ఎండ్ మోడల్ షావోమి 17T ప్రో ధర సుమారు రూ.1,11,000 ఉండే అవకాశం ఉంది.

Also Read: ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో అమెజాన్‌లోకి వచ్చేసిన Redmi Turbo 5!

స్క్రీన్ ఎలా ఉండబోతోంది?

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే షావోమి ఎక్కడా తగ్గడం లేదు. షావోమి 17T మోడల్‌లో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను ఇస్తున్నారు. అదే ప్రో మోడల్‌లో అయితే గేమర్స్ కోసం మరింత పెద్దదైన 6.83 ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్‌ను జోడించారు. ఇది ఏకంగా 144Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

ప్రాసెసర్ పవర్ ఎంత?

ఫోన్ ఎంత స్పీడ్‌గా పనిచేస్తుందనేది అందులోని ప్రాసెసర్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో సాధారణ మోడల్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను వాడుతున్నారు. అదే ప్రో మోడల్‌లో అయితే హైస్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం పవర్‌ఫుల్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను సెట్ చేశారు. ఇవి 12GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో త్వరలో లాంచ్ కానున్నాయి.

Also Read: వారెవ్వా మెటా క్రేజీ అప్డేట్.. గాల్లో వేళ్లు కదిలిస్తే చాలు మెసేజ్ టైప్ అయిపోద్ది, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఫుల్ ఖుషీ!

 

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×