E-Paper
Advertisement

టెక్ లవర్స్‌కు పూనకాలే.. Xiaomi 18 కంటే ముందే మార్కెట్లోకి Redmi K100, ఇక విధ్వంసమే!

టెక్ లవర్స్‌కు పూనకాలే.. Xiaomi 18 కంటే ముందే మార్కెట్లోకి Redmi K100, ఇక విధ్వంసమే!
Advertisement

Redmi K100 Series: ప్రముఖ టెక్ సంస్థ షియోమీ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల లాంచ్ విషయంలో ఈ ఏడాది ఒక ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏటా కంపెనీ ముందుగా తమ ప్రీమియం షియోమీ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చి, ఆ తర్వాతే రెడ్‌మి K సిరీస్‌ను పరిచయం చేస్తుంటుంది. కానీ, ఈసారి ఆ సంప్రదాయానికి బ్రేక్ పడబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. షియోమీ 18 సిరీస్ కంటే ముందే రెడ్‌మీ K100 సిరీస్ మన ముందుకు వచ్చే అవకాశం ఉందంటూ టెక్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మూడో త్రైమాసికంలోనే ఎంట్రీ?

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ప్రకారం.. రెడ్‌మీ K100 సిరీస్‌లోని టాప్ వేరియంట్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలోనే (Q3) విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో రాబోయే సెప్టెంబర్ నెలలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని అంచనా. ఇదే సమయంలో క్వాల్‌కామ్ తమ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 6 ప్రాసెసర్‌ను ప్రకటించనుంది.

Advertisement

Also Read: టెక్ లవర్స్ గెట్ రెడీ.. షావోమి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, లాంచ్ డేట్ ఫిక్స్!

ఈ కొత్త చిప్‌సెట్‌తోనే రెడ్‌మీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతుందని టాక్. అలాగే, ఈ ఏడాది చివరి త్రైమాసికంలో రెడ్‌మి టర్బో 6 సిరీస్‌తో పాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా కంపెనీ లైన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

టాప్ ఫీచర్లతో రెండు మోడల్స్:

Advertisement

తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌లో కనీసం రెండు మోడల్స్ వచ్చే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ అయిన రెడ్‌మి K100 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రానుండగా.. ప్రీమియం మోడల్ అయిన రెడ్‌మి K100 ప్రో మాక్స్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 6 చిప్‌తో రాబోతుంది.

కాగా, ఇదే సెప్టెంబర్ నెలలో షియోమీ 18 సిరీస్ (షియోమీ 18, 18 ప్రో, 18 ప్రో మాక్స్) కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో.. సొంత బ్రాండ్ల మధ్యే గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వివరాలపై షియోమీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: వాటర్ ప్రూఫ్, ఐపీ68 రేటింగ్‌తో Vivo కొత్త ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సెన్సేషనల్ డీల్, మిస్ చేసుకోవద్దు!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×