E-Paper
Advertisement

హానర్ కొత్త ఫోన్ల రచ్చ మొదలైంది.. 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా ఫీచర్లు చూస్తే దిమ్మ తిరుగుద్ది!

హానర్ కొత్త ఫోన్ల రచ్చ మొదలైంది.. 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా ఫీచర్లు చూస్తే దిమ్మ తిరుగుద్ది!
Advertisement

Honor 600 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ నేటి యువతను ఆకట్టుకునేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కొత్త ఫోన్లను విడుదల చేస్తూ.. తమ దూకుడును పెంచుకుంటోంది. త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ‘Honor 600’ పేరుతో అదిరిపోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను తీసుకురాబోతోంది. అయితే అధికారికంగా లాంచ్ కాకముందే.. ఈ సిరీస్‌లో రాబోయే Honor 600 Pro, Honor 600 మోడళ్ల ఫీచర్లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఈ సమాచారం ప్రకారం ఈ ఫోన్ సిరీస్ మార్కెట్లోకి రాగానే మిగతా బ్రాండ్లకు చుక్కలు చూపించడం గ్యారెంటీ అనిపిస్తుంది.

స్లిమ్ సైజులో క్లాసీ లుక్..

Honor Pro మోడల్‌లో టాప్ ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ వాడుతుంటే.. స్టాండర్డ్ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను సెట్ చేశారు. ఈ ఫోన్లు చూడటానికి చాలా స్లిమ్‌గా (కేవలం 7.8 మిమీ) ఉండి, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. మెటల్ ఫ్రేమ్, మ్యాట్ ఫినిషింగ్‌తో పాటు డిస్‌ప్లే చుట్టూ ఉండే అంచులు (బెజెల్స్) అసలు లేవా అన్నట్టుగా చాలా సన్నగా ఉన్నాయి.

బురదలో పడ్డా డోంట్ వర్రీ..

Advertisement

సాధారణంగా ఫోన్లకు ఉండే ఐపీ రేటింగ్స్ కంటే ఈసారి హానర్ ఒక అడుగు ముందుకు వేసింది. ఈ ఫోన్లకు IP68, IP69తో పాటు IP69K రేటింగ్ కూడా ఇచ్చారు. దీంతో ధూళిలో ఉన్నా.. వేడి నీటి జల్లులు పడినా, ఫోన్ పొరపాటున నీటిలో మునిగినా కూడా ఏమీ కాదు. రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Also Read: ఓరి నాయనా.. iPhone 15 Proపై ఏకంగా రూ.59,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

కెమెరా అంటే ఇలా ఉండాలి..

Advertisement

ఈ సిరీస్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ప్రో మోడల్‌లో 200 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు, దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా షూట్ చేసేలా 50 ఎంపీ టెలిఫోటో లెన్స్‌ను ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. అలాగే ఫోటోలు తీసుకునేటప్పుడు నాచురల్ కలర్స్ రావడం కోసం వెనుక వైపు ప్రత్యేకమైన సెన్సార్‌ను కూడా అమర్చారు.

48 గంటల బ్యాటరీ బ్యాకప్..

ఈ ఫోన్లలో టెక్ ప్రియులను ఆశ్చర్యపరిచే విషయం బ్యాటరీ సామర్థ్యం. ఏకంగా 7000mAh బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇన్ని ఫీచర్లు ఉన్నా ఫోన్ బరువు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రో వెర్షన్ వాడేవారు వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ సిరీస్ ఏప్రిల్ 23న అఫీషియల్‌గా లాంచ్ కానున్నాయి. ఇవి బ్లాక్, గోల్డెన్ వైట్, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులోకి రాబోతున్నాయని సమాచారం.

Also Read: BSNL సిమ్ తీసుకుంటున్నారా? ముందు మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×