E-Paper
Advertisement

BSNL సిమ్ తీసుకుంటున్నారా? ముందు మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

BSNL సిమ్ తీసుకుంటున్నారా? ముందు మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Advertisement

BSNL Signals: ఈ మధ్య కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలు పెరగడంతో.. చాలామంది దృష్టి BSNL వైపు మళ్లింది. ఈ నెట్‌వర్క్‌లో తక్కువ ధరకే ప్లాన్‌లు దొరుకుతుండటంతో కొత్త సిమ్ తీసుకోవాలని లేదంటే పోర్ట్ అవ్వాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ఆత్రుతగా సిమ్ తీసేసుకునే ముందు ఒక్క విషయం ఆలోచించాలి. BSNL ఇప్పుడు ఊపందుకుంటున్న మాట నిజమే కానీ, అన్ని ఊర్లలోనూ సిగ్నల్ ఒకేలా ఉండదు. అందుకే, సిమ్ కొన్నాక ‘అయ్యో.. సిగ్నల్ రావట్లేదే’ అని బాధపడకుండా ఉండాలంటే.. ముందుగా ఈ చిన్న చిన్న విషయాలు చెక్ చేసుకోండి.

కంపెనీ పోర్టల్‌లోకి వెళ్లి..

మీ ప్రాంతంలో BSNL సర్వీస్ ఉందో లేదో తెలుసుకోవడానికి సులువైన మార్గం BSNL అఫీషియల్ వెబ్‌సైట్ చూడటం. ఈ సైట్‌లో నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ ఊరి పేరు గానీ, పట్టణం పేరు గానీ టైప్ చేస్తే చాలు.. అక్కడ 2G ఉందా, 4G వస్తుందా అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. కంపెనీ ఇచ్చే సమాచారం కాబట్టి దీనిపై మనం ఓ అవగాహనకు రావచ్చు.

Advertisement

Also Read:కేవలం రూ.1కే కొత్త సిమ్.. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్ల కంటే ఇదే తక్కువా? పూర్తి వివరాలివే!

మరింత క్లారిటీ కావాలంటే..

కొన్నిసార్లు కంపెనీ మ్యాప్‌లో సిగ్నల్ ఉన్నట్టు చూపిస్తుంది కానీ, ఇంటి లోపలకి వెళ్తే రాకపోవచ్చు. ఇలాంటి టైమ్‌లో nPerf వంటి వెబ్‌సైట్లు లేదంటే కొన్ని మొబైల్ యాప్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఈ యాప్స్ ఏం చేస్తాయంటే.. ఆ ఏరియాలో వాడుతున్న వాళ్ల నిజమైన డేటా ఆధారంగా రిపోర్ట్స్ ఇస్తాయి. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది? కాల్స్ కట్ అవుతున్నాయా? వంటి వివరాలు లైవ్‌లో చూడొచ్చు. సిమ్ కొనే ముందే ఇలాంటి యాప్స్ ద్వారా ఒకసారి చెక్ చేస్తే పక్కా క్లారిటీ వస్తుంది.

ఈ పద్ధతి ద్వారా తెలిసిపోద్ది..

Advertisement

నిజం చెప్పాలంటే.. ఆన్‌లైన్ రిపోర్టుల కంటే మన ఊర్లో మన పక్కన ఉండేవారు చెప్పే మాటే కరెక్ట్. మీ ఏరియాలో ఇప్పటికే BSNL వాడుతున్న ఫ్రెండ్స్ గానీ, ఇరుగుపొరుగు వారు గానీ ఉంటే వారిని అడిగి చూడండి. వాళ్లు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇంకేం ఉండదు. ముఖ్యంగా మరీ పల్లెటూర్లలో ఉండేవారికి ఈ పద్ధతి వంద శాతం కరెక్ట్‌గా పనిచేస్తుంది.

సిమ్ కార్డ్ కొనేముందు..

సిమ్ కార్డ్ ఏముంది.. తక్కువ ధరకే వస్తుంది కదా అని కొనేస్తాం. కానీ సిగ్నల్ లేకపోతే ఆ నెంబర్‌కు వచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్, ఓటీపీలు రాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా నెట్‌వర్క్ మారాలంటే మళ్లీ మూడు నెలలు వెయిట్ చేయాలి. అందుకే.. పైన చెప్పినట్టుగా వెబ్‌సైట్‌లో చూసి, పక్కనోళ్లను అడిగి.. అంతా ఓకే అనుకుంటేనే BSNL లోకి మారండి. అప్పుడే మీరు తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను వాడుకోగలరు.

Also Read: ఈ స్మార్ట్ టీవీల ధర ఆండ్రాయిడ్ పోన్ల కంటే తక్కువే.. బ్యాచిలర్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి!

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×