E-Paper
Advertisement

Honor Robot Phone: 7200mAh బ్యాటరీ, 200MP కెమెరా.. ఫోల్డబుల్ ఫోన్ల రికార్డులు తిరగరాయనున్న హానర్ మ్యాజిక్ V6!

Honor Robot Phone: 7200mAh బ్యాటరీ, 200MP కెమెరా.. ఫోల్డబుల్ ఫోన్ల రికార్డులు తిరగరాయనున్న హానర్ మ్యాజిక్ V6!
Advertisement

Honor Robot Phone: స్మార్ట్‌ఫోన్ అంటే జస్ట్ స్క్రీన్, కెమెరా మాత్రమే కాదు.. అంతకు మించి ఏదో ఉండాలనుకునే వారికోసం Honor ఒక క్రేజీ అప్‌డేట్ తీసుకొచ్చింది. మార్చి 1న బార్సిలోనాలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026 వేదికగా.. Magic V6, Robot Phone అనే రెండు ఫోన్లను కంపెనీ విడుదల చేయనుంది. AI టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే సరికొత్త చాప్టర్ మొదలుపెట్టబోతున్న ఈ మెగా ఈవెంట్.. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు లైవ్ స్ట్రీమ్ కానుంది. టెక్ లవర్స్‌కి నిజంగా ఇదొక పండగనే చెప్పాలి.

మెస్మరైజ్ చేయనున్న Honor Robot Phone:

ఈ రోబోట్ ఫోన్ గురించి 2025 అక్టోబర్‌లోనే చిన్న క్లూ ఇచ్చిన హానర్.. ఇప్పుడు దీనిని అధికారికంగా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిపై ఒక గింబాల్‌పై అమర్చిన పాప్ అవుట్ AI కెమెరా ఉంటుంది. ఇది రొటేటింగ్ మోటార్ సాయంతో తనకు తానుగా కదులుతూ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మీ చేతిలో ఉండబోయేది స్మార్ట్‌ఫోన్ కాదు.. చిన్నపాటి రోబోటిక్ బ్రెయిన్ అనే చెప్పాలి.

Advertisement

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో వచ్చిన తొలి ఫోన్.. మోటొరోలా సిగ్నేచర్ ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది భయ్యా!

పర్సనల్ అసిస్టెంట్‌గా AI కెమెరా:

Honor Robot ఫోన్‌లోని కెమెరా కేవలం ఫోటోలు తీయడానికే కాదు.. మన రోజువారీ పనుల్లో సాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి ఏ షూస్
సెట్ అవుతాయో ఇది సలహా ఇస్తుంది. అలాగే ఇంట్లోని పెంపుడు జంతువులను గుర్తించడం నుంచి ఏదైనా వస్తువుల గురించి అడిగే ప్రశ్నలకు స్పాట్‌లోనే సమాధానాలు చెప్పడం వరకు ఈ AI అసిస్టెంట్ ఎంతో తెలివిగా పనిచేస్తుంది.

పవర్‌ఫుల్ ఫోల్డబుల్ ఫోన్‌గా Magic V6:

Advertisement

రోబోట్ ఫోన్‌తో పాటు హానర్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్ Magic V6ను కూడా రంగంలోకి దించుతోంది. ఈ ఫోన్‌లో సరికొత్త 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అమర్చుతున్నట్లు టెక్ నిపుణుల అంచనా. ఇక ఫొటోగ్రఫీ లవర్స్ కోసం 200MP మెయిన్ కెమెరాతో పాటు 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే పెరిస్కోప్ లెన్స్‌ను కూడా అమర్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్‌లో ఉంటుందని సమాచారం.

భారీ బ్యాటరీ లైఫ్..

సాధారణంగా మడతపెట్టే ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందనే కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఈ Magic V6 లో మాత్రం ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. దీనిలో 7,150mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇంత శక్తివంతమైన బ్యాటరీ ఒక ఫోల్డబుల్ ఫోన్‌లో రావడం నిజంగా విశేషమే. టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవం తీసుకురాబోతున్న ఈ రెండు ఫోన్ల పూర్తి వివరాల కోసం మార్చి 1 వరకు వేచి చూడాల్సిందే మరి.

Also Read: 1930ల నాటి క్లాసిక్ లుక్.. 2026 క్రేజీ ఫీచర్స్.. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఫుజిఫిల్మ్ నయా సెన్సేషన్!

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×