E-Paper
Advertisement

Cruisym 400 Maxi Scooter: SYM నుంచి క్రేజీ స్కూటర్ లాంచ్, దీని మైలేజ్ ఎంతో తెలుసా?

Cruisym 400 Maxi Scooter: SYM  నుంచి క్రేజీ స్కూటర్ లాంచ్, దీని మైలేజ్ ఎంతో తెలుసా?
Advertisement

SYM Cruisym 400 Maxi Scooter Mileage: తైవాన్ మోటార్ కంపెనీ SYM.. సరికొత్త కొత్త క్రూయిసిమ్ 400 మ్యాక్సీ స్కూటర్‌ ను మార్కెట్‌ లోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం యూరప్‌ లో పాపులర్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న అప్రిలియా SR GT 400కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటలీలోని మిలన్‌ లో జరిగిన EICMA 2025 షో లో అప్రిలియాను ఆవిష్కరించింది. SYM తన కొత్త మోడల్ ను కూడా అదే వేదికగా లాంచ్ చేసింది.

SYM క్రూయిసిమ్ 400 అదిరిపోయే ఇంజిన్ సామర్థ్యంతో రానుంది. ఇది 399 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ తో ప్రీమియం టూరింగ్ మ్యాక్సీ స్కూటర్ గా రాబోతోంది. ఇది 7 అంగుళాల TFT డిస్‌ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ABS, LED లైటింగ్, అడ్జస్టబుల్ బ్యాక్‌ రెస్ట్ లాంటి లేటెస్ట్ ఫీచర్లతో రూపొందించబడింది, ఇది లాంగ్ రైడ్‌లకు అనువుగా ఉంటుంది.

క్రూయిసిమ్ 400 మ్యాక్సీ కీలక ఫీచర్లు  

Advertisement

క్రూయిసిమ్ 400 మ్యాక్సీ స్కూటర్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇది 399 cc, 4 స్ట్రోక్, EFI సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 34 bhp పవర్ ను అందిస్తుంది. 37 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లో లేటెస్ట్ టెక్నాలజీ పొందుపరచబడింది. 7 అంగుళాల TFT స్క్రీన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ డాష్ క్యామ్ ఉంటుంది.

Read Also: హోండా యాక్టివా 125 vs TVS జూపిటర్ 125..వీటిలో ఏది బెస్ట్ అంటే?

క్రూయిసిమ్ 400 మ్యాక్సీ మైలేజ్ ఎంత అంటే?

Advertisement

ఇక క్రూయిసిమ్ అదిరిపోయే డిజైన్ ను కలిగి ఉంటుంది. పూర్తి LED హెడ్‌ లైట్లు, సర్దుబాటు చేయగల 3 స్థానాల బ్యాక్‌ రెస్ట్ ఉంటుంది. భద్రత, సౌకర్యం విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, సర్దుబాటు చేయగల రియర్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ స్కూటర్ లో 14 లీటర్ల సామర్థ్యంతో కూడిన ప్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఒక్క లీటర్ పెట్రోల్ తో 60 నుంచి 70 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక ఈ బైక్ సుమారు 215 కిలోల బరువు ఉంటుంది.

Read Also: మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

క్రూయిసిమ్ 400 మ్యాక్సీ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఈ మ్యాక్సీ స్కూటర్ సిటీలో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలకు చాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది. దీని ధర, లభ్యత మార్కెట్‌ ను బట్టి మారుతుంటాయి.  UKలో సుమారు 5 వేల పౌండ్లు(£5,000)గా ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ ధర రూ. 5.4 లక్షలుగా ఉంటుంది. SYM  కొత్త మ్యాక్సీ స్కూటర్.. అప్రిలియా, వోజ్ లాంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారతీయ మార్కెట్ లోకి ఈ స్కూటర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

Read Also: సరికొత్తగా 1940 నాటి బైక్.. మతి పోగొట్టేస్తున్న2026 ఇండియన్ చీఫ్ వింటేజ్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×