E-Paper
Advertisement

HONOR Magic 8 Pro: 7100mAh బ్యాటరీ, AI ఇమేజింగ్.. హానర్ మ్యాజిక్ 8 ప్రో లాంచ్ హైలైట్స్ ఇవే!

HONOR Magic 8 Pro: 7100mAh బ్యాటరీ, AI ఇమేజింగ్.. హానర్ మ్యాజిక్ 8 ప్రో లాంచ్ హైలైట్స్ ఇవే!

HONOR Magic 8 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ HONOR తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ 8 ప్రోను అధికారికంగా మార్కెట్‌(దుబాయ్) లోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌లో గ్లోబల్‌గా పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ప్రాంతీయంగా విడుదలైంది. UAEలో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో లాంచ్ అయిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం గమనార్హం. ఈ కొత్త ప్రాసెసర్‌తో గతంలో కంటే మెరుగైన పనితీరు పొందొచ్చని సంస్థ చెబుతోంది. అలాగే ఈ హానర్ మ్యాజిక్ 8 ప్రో.. మెరుగైన హీట్ మేనేజ్‌మెంట్‌తో దీర్ఘకాల వినియోగానికి అనుకూలంగా ఉండనుంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే యూజర్లకు ఈ Magic8 Pro బెటర్ ఆప్షన్.

హైస్పీడ్ నెట్‌వర్క్ సపోర్ట్‌:

ఈ HONOR Magic8 Proలో భారీ 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. దీనివల్ల దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాక్‌అప్ లభించనుంది. UAEలో 5.5G కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలవడం మరో ప్రత్యేకత. Etisalat by e& సహా ప్రాంతీయ టెలికాం సంస్థలతో కలిసి హానర్ ఈ హైస్పీడ్ నెట్‌వర్క్ సపోర్ట్‌ను అందిస్తోంది.

ఏఐ ప్రొపెషనల్ ఫీచర్లు:

స్మార్ట్ వినియోగాన్ని మరింత సులభం చేసేలా ఈ ఫోన్‌లో AI ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్‌ను చేర్చారు. AI బటన్, AI సెర్చ్, AI డాక్యూమెంట్స్ వంటి ఫీచర్లు మన రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇమేజింగ్ విభాగం ఈ ఫ్లాగ్‌షిప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 200MP AI అల్ట్రా నైట్ టెలిఫోటో కెమెరా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా స్పష్టమైన ఫొటోలను అందించేలా రూపొందించారు. అప్‌గ్రేడెడ్ AI అల్ట్రా నైట్ పోర్ట్రైట్ మోడ్ ఎక్స్‌పోజర్, కలర్ యాక్యురసీని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు AI మ్యాజిక్ కలర్, AI ఎడిటర్ ఫీచర్లు డివైస్‌లోనే ఫొటోలను ప్రొఫెషనల్ స్థాయిలో ఎడిట్ చేయడానికి సహాయపడతాయి.

హానర్ మ్యాజిక్ 8 ప్రోలో 6.71-అంగుళాల 1.5K LTPO OLED క్వాడ్ కర్డ్వ్ డిస్‌ప్లే ఉంది. ఇది HDR10+ను సపోర్ట్ చేస్తూ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్ 1800 nits, HDR పీక్ 6000 nits కలిగిస్తుంది. డివైస్‌లో Snapdragon 8 Elite Gen 5 3nm ప్లాట్‌ఫారమ్, Adreno 840 GPU అమర్చారు. దీంతో అత్యాధునిక ప్రాసెసింగ్ సామర్థ్యం, గ్రాఫిక్స్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది 12GB లేదా 16GB LPDDR5X RAMతో పాటు 512GB లేదా 1TB UFS 4.0 స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది Android 16 ఆధారితంతో సులువుగా నావిగేట్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే:

ఈ హ్యాండ్ సెట్ రియర్ కెమెరా సెటప్ 50MP వైడ్, 50MP అల్ట్రా వైడ్ (2.5cm మాక్రో), 200MP టెలిఫోటో (3.7X ఆప్టికల్ జూమ్, 100X డిజిటల్ జూమ్, OIS), 4K 60fps వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 50MP + 3D డెప్త్ సెన్సార్‌తో 4K 60fps వీడియో తీసుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. డివైస్ IP68, IP69, IP69K రేటింగ్స్‌తో వస్తుంది. అలాగే ఇందులోని అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్, IR సెన్సార్ సెక్యూరిటీని మెరుగుపరుస్తాయి.

పర్ఫెక్ట్ ఆడియో ఎక్స్‌పీరియన్స్:

హానర్ మ్యాజిక్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 7100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనిలో 100W వైర్డ్ Super Charge, 80W వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు ఉండటంతో ఈ ఫోన్ ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంది. అలాగే 5G, Wi-Fi 7, Bluetooth 6.0, NavIC, NFC, USB 3.2 Gen1 Type-C కనెక్టివిటీతో స్మార్ట్ కనెక్ట్ అనుభవం అందిస్తుంది. దీంతోపాటు డ్యుయల్ స్టీరియో స్పీకర్లు DTS:X Ultra సపోర్ట్‌తో వినియోగదారులకు పర్ఫెక్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్‌ను అందిస్తాయి.

ధర ఎంత ఉండొచ్చు?

UAEలో HONOR Magic8 Pro ప్రీ-ఆర్డర్లు డిసెంబర్ 11 నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.97,840గా, 16GB RAM + 1TB వేరియంట్ సుమారు రూ.1,14,965 ధరకి అందుబాటులో ఉంది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×