E-Paper
Advertisement

Honor Magic 8 Pro vs 7 Pro: హానర్ మ్యాజిక్ 8 ప్రో vs హానర్ మ్యాజిక్ 7 ప్రో.. రెండు ఫోన్లలో ఎవరు అసలైన కింగ్?

Honor Magic 8 Pro vs 7 Pro: హానర్ మ్యాజిక్ 8 ప్రో vs హానర్ మ్యాజిక్ 7 ప్రో.. రెండు ఫోన్లలో ఎవరు అసలైన కింగ్?
Advertisement

Honor Magic 8 Pro vs 7 Pro: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో హానర్ కొత్త మోడల్ మ్యాజిక్ 8 ప్రో ప్రకటించడంతో మొబైల్ రంగంలో ఆసక్తి పెరిగింది. ముందుగా మార్కెట్లో ప్రవేశించిన మ్యాజిక్ 7 ప్రో తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్‌పై వినియోగదారుల దృష్టి నిలిచింది. ఈ రెండు మోడళ్లలో ప్రాసెసింగ్ తీరు, ఫోటో అవుట్‌పుట్, బ్యాటరీ పనితీరు వంటి అంశాలు ఇప్పుడు చర్చలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులు తమ రోజువారీ అవసరాలకు సరిపడేది ఏదో తెలుసుకోవాలంటే పూర్తి వివరంగా చూద్దాం.

Honor Magic 7 Pro

Advertisement

హానర్ మ్యాజిక్ 7 ప్రో విడుదలైన సమయంలో ఫోన్ మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చేతిలో పట్టుకున్నప్పుడు వచ్చే గ్రిప్, ఫోన్ మొత్తం ఇచ్చే ప్రీమియం ఫీల్ వాడిన ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా క్లారిటీ, ముఖ్యంగా టెలిఫోటో కెమెరా దగ్గర ఉన్న స్పష్టత, దూరంనుంచి తీసిన ఫోటోలలో వచ్చే క్లారిటీ ఇవి మ్యాజిక్ లైన్‌ అప్‌ని ప్రత్యేకంగా చూపించే లక్షణాలు. కానీ ఈ ఫోన్‌లో బ్యాటరీ పరిమాణం కొంచెం తక్కువగా ఉండటం, ఎక్కువసేపు గేమింగ్ లేదా వీడియో రికార్డింగ్ చేసినప్పుడు రోజుకి రెండోసారి ఛార్జ్ పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. అయినా కూడా మ్యాజిక్ 7 ప్రో ఒక మంచి ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందించింది.

Honor Magic 8 Pro

Advertisement

ఇక హానర్ మ్యాజిక్ 8 ప్రో వైపు చూస్తే ఇది మ్యాజిక్ 7 ప్రోకి వారసుడిగా కాకుండా, సిరీస్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లే విధంగా రూపొందించబడింది. రూపం చూసిన వెంటనే ఇది ఒక కొత్త తరం డివైస్‌ అని అనిపిస్తుంది. అప్‌డేటెడ్ లుక్, తేలికగా, చేతిలో సౌకర్యంగా ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలంటే మ్యాజిక్ 7 ప్రో ఫోన్ ఫీచర్ల కంటే 8ప్రో ఫీచర్లు ముందున్నాయి. పనిచేసే విధానం, చిప్ మరింత వేగంగా స్పందించేలా హానర్ కొత్త తరం స్నాప్‌డ్రాగన్‌ని వాడింది. భారీ గ్రాఫిక్ గేమ్స్, 4కె వీడియో రికార్డింగ్, పెద్ద యాప్స్ ఏ పని చేసినా ఇది అలసట లేకుండా పనిచేస్తుంది.

కెమెరాలో ఏది బెస్ట్

కెమెరా విషయానికి వస్తే మ్యాజిక్ 7 ప్రో ఇప్పటికే మంచి ప్రమాణాలు చూపించినా మ్యాజిక్ 8 ప్రో లో అది మరో స్థాయికి వెళ్లింది. దూరం నుంచి అయినా స్పష్టత తగ్గకుండా జూమ్ పనిచేయడం, రాత్రి సమయంలో తక్కువ వెలుతురులో కూడా వచ్చే రంగు నిష్పత్తి బాగుండడం, పగటి వెలుతురులో తీసిన ఫోటోలలో వచ్చే డీటైల్ స్థాయి అన్నీ మ్యాజిక్ 8 ప్రోని కెమెరా అభిమానుల కోసం ప్రత్యేకంగా నిలబెడతాయి. మునుపటి తరం కంటే టెలిఫోటో కెమెరా దూరం, స్పష్టత, రంగుల లోతు అన్నీ మెరుగుపడ్డాయి.

Also Read: Vivo T5 5G 2026 Smartphone: వివో టి5 5జి త్వరలో లాంచ్.. ఫీచర్లు ఒక్కసారి చూడండి

బ్యాటరీ 7ప్రో కన్నా 8ప్రో ఎలా ఉందంటే?

బ్యాటరీ విషయానికి వస్తే మ్యాజిక్ 7 ప్రోలో ఉన్న పరిమాణం సరిపడేలా ఉన్నా మ్యాజిక్ 8 ప్రోలో బ్యాటరీను మరింత పెద్దదిగా చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది ఉదయం నుండి రాత్రి వరకు తగినంత శక్తితో పనిచేస్తుంది. గేమింగ్, సోషల్ మీడియా, వీడియోలు అన్నీ భారమైన వాడకంలో కూడా బ్యాటరీ శాతం త్వరగా తగ్గకుండా నిలబడగల శక్తి మ్యాజిక్ 8 ప్రోలో ఉంది.

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్

సాఫ్ట్‌వేర్ అనుభవం, భద్రత, స్క్రీన్ స్పందన అన్నీ విషయాల్లో మ్యాజిక్ 8 ప్రో ముందు తరం కంటే మెరుగుపడింది. యాప్‌ల మధ్య మార్పులు సులభంగా జరుగుతాయి, ఇంటర్‌ఫేస్ స్మూత్‌గా ఉంటుంది, ఫోన్ మూవింగ్ అయినా కళ్లకు క్లారిటీగా కనిపిస్తాయి.

ఇప్పుడు అసలు ప్రశ్న రెండు ఫోన్లలో ఒకటే బెస్ట్ ఏది?

స్పష్టంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఇంకా మూడు సంవత్సరాలు కూడా వేగంగా, బలంగా పనిచేసే ఫోన్ కావాలంటే హానర్ మ్యాజిక్ 8 ప్రో ముందు ఉంటుంది. దీని కెమెరా సామర్థ్యం, బ్యాటరీ బలం, ప్రాసెసింగ్ వేగం అన్నీ మ్యాజిక్ 7 ప్రో కంటే ఒక మెట్టు ఎక్కువ. మ్యాజిక్ 7 ప్రో మంచి ఫోన్ అయినా మ్యాజిక్ 8 ప్రో మాత్రం పూర్తిగా కొత్త తరానికి తగిన శక్తితో ఉంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×