E-Paper
Advertisement

Guava Benefits: జామపండు ఎందుకు తినాలో ఈ కారణాలు తెలిస్తే.. ఆశ్చర్యపోవడం మీ వంతు!

Guava Benefits: జామపండు ఎందుకు తినాలో ఈ కారణాలు తెలిస్తే.. ఆశ్చర్యపోవడం మీ వంతు!
Advertisement

Guava Benefits: సీజన్‌తో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని కాలాల్లోనూ లభించే పండు జామ. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో జామపండు తింటే బోలెడె బెనిఫిట్స్ ఉంటాయి. జామపండులో తక్కువ కేలరీలు, తక్కువ చక్కెర ఉంటాయి. 100 గ్రాముల జామపండులో కేవలం 68 కేలరీలు, 8.92 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా రోజువారీ డైట్‌లో జామపండును చేర్చుకోవడం ద్వారా అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్ర‌మంలో రోజుకో జామపండు ఎందుకు తినాలో? రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన శరీర రోగనిరోధక శక్తిని బలపరచడంలో జామ కీలకంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు, శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సమర్థంగా పోరాడుతుంది. జామలో.. ఆరెంజ్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల బాడీలో ఏర్పడే హానిని నివారించడంలో జామపండులోని యాంటీఆక్సిడెంట్లు ఎంతగానో సహాయపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

Advertisement

జామపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో జామ ప్రభావవంతంగా పనిచేస్తుంది. పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఈ కారణంగా మధుమేహం ఉన్న వారికి జామపండు మంచి ఎంపిక.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది:

జామపండులో విటమిన్ బి6, విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వలన మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో నరాలు రిలాక్స్ అవుతాయి. జామపండు మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యానికి మంచిది:

Advertisement

జామపండులో పండులోని విటమిన్ ‘ఎ’ కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. కంటిచూపును మెరుగుపరచడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. వయసుతో కంటి సమస్యలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడంలో జామ పండు ఎంతో సహాయపడుతుంది. కంటి సమస్యలను నివారించుకోవడానికి జామ రసం తాగడం మంచిదని నిపుణులు చెబుతారు.

గుండె ఆరోగ్యం పదిలం:

జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాడానికి ప్రతిరోజూ ఒక జామపండు తినడం మేలు చేస్తుంది. ఈ పండులోని పొటాషియం కొంత మేర అరటిపండులో ఉన్న దానితో సమానంగా ఉంటుంది. కాబట్టి జామపండు కూడా గుండె ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.

సంతాన సామర్థ్యం పెరుగుతుంది:

ఈ జామ పండులోని మాంగనీస్ మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు శరీరం సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇతర పోషకాలు శరీరంలో క్రమంగా చేరడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా జామపండులో ఫోలేట్ ఉంటుంది. ఈ ఫోలేట్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బరువు అదుపులో ఉంటుంది:

అధిక బరువు ఉన్నవాళ్లు రోజుకో జామపండు తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చు. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీంతో జీవక్రియను నియంత్రించడానికి, బరువును అదుపులో ఉంచడానికి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడానికి జామ మంచిది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×